బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్.. ఈ సినిమాలో రణ్ బీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు.డిసెంబర్ 1న విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది..ఈ సినిమాను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అద్భుతంగా తెరకెక్కించాడని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు mప్రస్తుతం రిలీజ్ అవుతున్న చాలా సినిమాలు రెండున్నర గంటలు ఉంటేనే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారేమో అని భావిస్తున్నారు మేకర్స్..అలాంటి పరిస్థితి లో కూడా కచ్చితంగా ‘యానిమల్’సినిమాను ప్రేక్షకులు ఇష్టపడతారు అనే నమ్మకంతో దాదాపు మూడున్నర గంటల సినిమాను వారి ముందు ఉంచాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తను ఎంతో ఇష్టంతో తెరకెక్కించిన చిత్రాన్ని ఎవరూ కట్ చేయకూడదు అనే ఉద్దేశ్యంతో తానే ఎడిటర్ గా వ్యవహరించాడు.
అందుకే 3 గంటల 49 నిమిషాల నిడివి వచ్చిన సినిమాను ఎక్కువగా కట్ చేయకుండా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ తో థియేటర్లలో విడుదల చేశాడు. అయితే సందీప్ డిలీట్ చేసిన సీన్స్లో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.ఇప్పటికే సెన్సార్ బోర్డ్.. ‘యానిమల్’సినిమాలోని ఒక న్యూడ్ సీన్ ను డిలీట్ చేసింది. దాంతో పాటు మరో డిలీటెడ్ సీన్ కూడా ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఈ సీన్లో రణబీర్ కపూర్ పూర్తిగా గాయాలతో కనిపిస్తున్నాడు. అంతే కాకుండా తన నడక కూడా సరిగా ఉండదు.. ఒక ప్రైవేట్ జెట్లో నడుచుకుంటూ ఒక డ్రింక్ తీసుకొని పైలెట్ దగ్గరకు వెళ్లి తనను పక్కకు తప్పుకోమని చెప్పి రణబీర్ విమానాన్ని నడుపుతాడు. ఆ ప్రైవేట్ జెట్లో ఉన్న మిగతా ప్రయాణికులు.. రణబీర్ ను ఆశ్చర్యంగా చూస్తుంటారు. అయితే హీరో ఈ సీన్లో సిగరెట్ తాగుతూ విమానాన్ని నడిపించడం కరెక్ట్ కాదని సెన్సార్ ఈ సీన్ ని తొలగించి ఉండవచ్చని లేకపోతే సందీపే ఈ ఒక్క సీన్ తన సినిమాలో అనవసరం అనుకొని కట్ చేసి ఉండవచ్చు ఏమో అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
https://twitter.com/DUNKISRKIAN/status/1730891511863382450?