Viral Video: జింక శాఖాహారా.. మాంసాహారా అంటే టక్కున మనం శాఖాహరి అనే అంటాం. ఎందుకంటే గడ్డి, దుంపలు తప్ప ఇంకేమీ తినదు. అంతేకాకుండా అవి చాలా సున్నితంగా ఉంటాయి. ఇవి ఎక్కువ అడవుల్లో జీవిస్తాయి. అడవుల్లో ఇవి ఎక్కువ భయపడుతూ.. ఎక్కడి నుంచి ఏ జంతువు వచ్చి చంపుకుతింటుందోనని భయంభయంగానే బతుకుతుంటాయి. ఎక్కువగా పులులు, సింహాలు జింకలను వేటాడుతూ ఉంటాయి.
Read Also: Lavanya Tripathi: మెగా కోడలి క్యాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?
అయితే సాధు జంతువైన ఓ జింక మాంసాహారాన్ని తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినడానికి నమ్మశక్యంగా లేకున్నా.. ఇది మాత్రం నిజం. ఓ జింక ఏకంగా చనిపోయిన పామును నోటితో కసబిసా నమిలి మింగేసింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యపోతున్నారు. పాపం గడ్డి అనుకుని పామును అలా నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా జింకలు ఇలా పాములను తినడం ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. మరోవైపు జింకలు మాంసాన్ని వెంబడించవచ్చని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పేర్కొంది. దానిలో ఫాస్పరస్, ఉప్పు, కాల్షియం వంటి ఖనిజాలను ఉండవని.. ముఖ్యంగా శీతాకాలపు నెలలలో మొక్కల జీవితం తక్కువగా ఉంటుందని.. ఈ కారణాలతో జింకలు మాంసాన్ని తినడానికి అవకాశం ఉంటుందని తెలిపింది.
Read Also: Bhola Shankar: తెలుగులో పోటీ లేదు అయినా ‘భోళా శంకర్’కి పెద్ద పరీక్షే?
ప్రస్తుతానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ‘ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాఖాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి’ అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.
Cameras are helping us understand Nature better.
Yes. Herbivorous animals do eat snakes at times. pic.twitter.com/DdHNenDKU0— Susanta Nanda (@susantananda3) June 11, 2023