Lavanya Tripathi: మెగా కోడలి క్యాస్ట్ కోసం గూగుల్ సెర్చ్.. ఏమని వచ్చిందంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి.. మెగా కోడలిగా కొన్ని రోజుల్లో మెగాస్టార్ ఇంట అడుగుపెట్టబోతుంది. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు.. హీరో వరుణ్ తేజ్ తో ఆమె నిశ్చితార్ధ వేడుక జూన్ 9 న ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఇక మెగా కోడలు అని తెలియడంతో లావణ్య గురించిన వివరాలను ఆరా తీయడం మొదలుపెట్టారు మెగా ఫ్యాన్స్. ముఖ్యంగా కొంతమంది అయితే ఆమె క్యాస్ట్ ఏంటి..? అని సెర్చ్ చేస్తున్నారట. లావణ్య త్రిపాఠి ఎవరు..? ఆమె కుటుంబం ఏంటి..? ఆమె పుట్టింది ఎక్కడ అని అభిమానులు గూగుల్ సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. అంతేనా.. మెగా కోడలు అని ముద్ర పడిన దగ్గరనుంచి ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అయితే అమాంతం పెరిగిపోయారు. ఇక వరుణ్ ఫ్యాన్స్ అయితే ముద్దుగా వదినా అని పిలవడం కూడా మొదలుపెట్టారు. కాగా, లావణ్య ఏ క్యాస్ట్ కు చెందిన అమ్మాయి అనేది చెప్పాలంటే.. ఆమె ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె డెహ్రడూన్ లో పుట్టింది. లావణ్యకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. లావణ్య నాన్న న్యాయవాది.. అమ్మ రిటైర్డ్ టీచర్. ఇక ఈ ముద్దుగుమ్మకు చిన్నతనం నుంచి మోడలింగ్ అంటే ఇష్టం ఉండడంతో చదువు పూర్తిచేసి సినిమాల వైపు అడుగులువేసింది.
Gopichand: ‘భీమా’తో గోపీచంద్ ట్రాక్ ఎక్కుతాడా!?
Also Read
- Suriya - Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
- The Paradise : నాని 'ది ప్యారడైజ్' సెన్సార్.. 'A' సర్టిఫికెట్
- Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
ఇకపోతే వరుణ్ తో పరిచయం 2016 లో జరిగింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసి పెళ్లి వరకు వచ్చింది. ఇక ఇది ఆమె గురించి సెర్చ్ చేస్తే గూగుల్ లో కనిపించింది. దీంతో అభిమానులు మెగా కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు. అందరిలా క్యాస్ట్ వేరు అని చెప్పకుండా ప్రేమకు విలువనిచ్చి పెళ్లి చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. ఆ లెక్కన చెప్పుకోవాలంటే.. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ కూడా వేరే క్యాస్ట్ నే. స్నేహాను బన్నీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక గతంలో కొడుకు పెళ్లి గురించి నాగబాబు కూడా ఈ విధంగానే చెప్పుకొచ్చాడు. తన కొడుకు ఎవరిని ప్రేమించినా.. ఎలాంటి అడ్డు చెప్పకుండా పెళ్లి చేసేస్తాను అని చెప్పుకొచ్చాడు. చెప్పినట్లుగానే వరుణ్- లావణ్యను కలిపి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఇక త్వరలోనే వీరి పెళ్లి ఇటలీలో జరగనుందని టాక్. మరి పెళ్లి కూడా ఎంగేజ్ మెంట్ లా సింపుల్ గా చేస్తారో, లేదో చూడాలి.
తాజావార్తలు
-
CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
Suriya – Jyotika: 20 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. పిల్లల ముందే సూర్య, జ్యోతిక ప్రమాణాలు, వీడియో వైరల్!
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ సెన్సార్.. ‘A’ సర్టిఫికెట్
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?