ప్రతి నెల ఆర్థిక మార్పులు అనేవి జరుగుతాయి.. ఈ నెల కూడా సామాన్యులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి.. డిసెంబర్ ఆర్థికపరంగా ఐదు కీలక మార్పులు జరగనున్నాయి. ఇవి దేశంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరి జీవితాలను ప్రభావితం చేయనున్నాయి. లోన్లు, గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం, డీమ్యాచ్ ఖాతాలున్నవారు నామిని ఇతర వివరాలు సమర్పించడం వంటివి ఈ నెలలో జరగనున్నాయి. ఇలా పలు ముఖ్యమైన విషయాల్లో డిసెంబర్ 1 నుంచి జరిగే మార్పులేంటి, అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్ గడువు..
ఆర్థిక సంవత్సరంలో రూ. 10,000 కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సిన వారు డిసెంబరు 15 లోపు వారి మూడో త్రైమాసిక వాయిదాల అడ్వాన్స్ పన్నును చెల్లించాలి. లేదంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి జరిమానా ఎదుర్కోవాల్సి వస్తుంది..
లైఫ్ సర్టిఫికెట్..
పెన్షన్ తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా నవంబర్ 30 తేదీలోగానే లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాల్సి ఉంది. లేకపోతే వాళ్ల పెన్షన్ డిసెంబర్ నుంచి సస్పెండ్ అవుతుంది.. మరి ఈ తేదీని పొడిగిస్తుందో లేదో తెలియదు..
సిలిండర్ ధర..
ప్రతి నెల ఒకటో తారీఖు గ్యాస్ సిలిండర్ ధరలను చమురు మార్కెటింగ్ సంస్థలు సవరిస్తుంటాయి. ఈనెల కూడా 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ. 21 పెంచాయి. అయితే ఇంట్లో ఉపయోగించే సాధారణ వంట గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం అలాగే స్థిరంగా ఉంచాయి.. మరి వచ్చే నెల మారవచ్చు..
ప్రాపర్టీ డాక్యుమెంట్ రిలీజ్..
ఇకపోతే ఈ డిసెంబర్ 1 నుంచి ఆర్బీఐ కొత్త రూల్ ను అమలు చేస్తోంది. ప్రాపర్టీ లోన్ తీసుకుని, లోన్ మొత్తం పూర్తిగా చెల్లించిన తర్వాత 30 రోజుల్లోగా ఆస్తి పత్రాలను కస్టమర్లకు బ్యాంకులు తిరిగి ఇవ్వాలి. లేదంటే ఆ తర్వాత రోజుకు రూ. 5,000 వరకు కస్టమర్లకు ఫెనాల్టీ ఇవ్వాలని రూల్.. ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది..ఇవన్నీ ఈరోజు మారినవి.. వీటిని అందరు తప్పక ఫాలో అవ్వాల్సి ఉంటుంది..