తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. మధ్య మండల డీసీపీ అక్షాంశ్ యాదవ్ ఈ అంశంపై స్పందించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేసుకున్నారు.. సినిమా వీక్షించేందుకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు.. ప్రేక్షకులతోపాటు సినిమాలో…