Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
Curd Rice Recipe: వేసవిలో ఏది తిందామన్నా రుచించదు.. తీవ్రమైన ఎండలతో ద్రవ పదార్థాలు తీసుకున్నంత సులవుగా గణ పదార్థాలు తీసుకోలేని పరిస్థితి.. అయితే, వేసవి కాలంలో తీవ్ర ఎండలు, వడదెబ్బల నుంచి రక్షణ పొందేందుకు సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తేలికగా, చల్లగా, సులభంగా జీర్ణమయ్యే ఆహారం కోసం చూస్తుంటే పెరుగన్నం (పెరుగు అన్నం) ఉత్తమమైన ఎంపికగా నిలుస్తుంది. దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ వంటకం రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరాన్ని చల్లబరచి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే, వేసవిలో శరీరానికి అవసరమైన తేమను నిలుపుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోజంతా శక్తివంతంగా ఉండేందుకు పెరుగన్నం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, తక్కువ సమయంలో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Also Read
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
- Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Gutti Vankaya Recipe : కుక్కర్‌లో గుత్తి వంకాయ.. పదే పది నిమిషాల్లో అద్భుతమైన రుచి.!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్‌రూట్ పులావ్ తయారు చేయండిలా..
కావలసిన పదార్థాలు
* ఒక కప్పు వండిన అన్నం
* ఒక కప్పు తాజా పెరుగు
* 3 టేబుల్ స్పూన్లు నూనె
* 5 పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)
* అరచిన్న అల్లం ముక్క (తరిగినది)
* ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర
* ఒక టేబుల్ స్పూన్ ఆవాలు
* 3 టేబుల్ స్పూన్లు శనగపప్పు
* చిటికెడు ఇంగువ
* 5-6 కరివేపాకు ఆకులు
* 2 ఎండుమిర్చి
* తగినంత ఉప్పు
తయారీ విధానం
ముందుగా ఒక పెద్ద గిన్నెలో తాజా పెరుగు తీసుకుని, ఉండలు లేకుండా బాగా గిలకొట్టాలి. తరువాత వండిన అన్నాన్ని అందులో వేసి బాగా కలపాలి. అన్నం గట్టిగా ఉంటే చేతులతో మెత్తగా చేసి కలపడం మంచిది. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, ఉప్పు వేసి మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి తాలింపు సిద్ధం చేయాలి. ఈ తాలింపును పెరుగు అన్నం మీద పోసి బాగా కలపాలి. ఇలా సిద్ధమైన పెరుగన్నాన్ని వెంటనే వడ్డించవచ్చు. మరింత చల్లగా తినాలనుకుంటే కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయవచ్చు. దీన్ని మామిడి ఊరగాయ లేదా పాపడ్‌తో కలిపి తింటే రుచి మరింత పెరుగుతుంది. వేసవిలో ఆరోగ్యంగా, చల్లగా ఉండాలంటే పెరుగన్నం మీ భోజనంలో తప్పనిసరిగా చేర్చుకోండి.
తాజావార్తలు
-
Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
-
Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
-
Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్‌ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
-
Repolling in Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు.. 15 బూత్‌లలో రీపోలింగ్ ప్రారంభం
-
Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!