Palakura Ullikaram Recipe : పాలకూర ఉల్లికారం.. అన్నం, చపాతీల్లోకి అదిరిపోయే రుచి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- పాలకూరతో వెరైటీ టేస్ట్.. సింపుల్‌గా సూపర్ కూర
- ఉల్లికారం మసాలాతో రుచికి కొత్త మలుపు
- తక్కువ టైంలో.. ఎక్కువ రుచితో రెడీ
- అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palakura Ullikaram Recipe in Telugu: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ చేసే పాలకూర పప్పు లేదా ఫ్రై కాకుండా, కొంచెం వెరైటీగా ‘పాలకూర ఉల్లికారం’ ప్రయత్నిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. అన్నం లేదా చపాతీ దేనిలోకైనా సరిపోయే ఈ కమ్మని వంటకాన్ని తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం.
కావలసిన పదార్థాలు:
Also Read
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
పాలకూర: 3 పెద్ద కట్టలు
ఉల్లిపాయలు: 3 మీడియం సైజు
వెల్లుల్లి: 1 మీడియం సైజు రెమ్మలు
కారం: 1 టేబుల్ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 3-4 టేబుల్ స్పూన్లు
పోపు దినుసులు: 1 టేబుల్ స్పూన్ (ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు)
ఎండు మిరపకాయలు: 3
కరివేపాకు: 1 రెమ్మ
పసుపు: 1/2 టీస్పూన్
పొడులు: వేయించిన ధనియాల పొడి (1 టీస్పూన్), వేయించిన జీలకర్ర పొడి (1/4 టీస్పూన్)
తయారీ విధానం:
1. పాలకూరను సిద్ధం చేయడం:
ముందుగా పాలకూరను 3-4 సార్లు శుభ్రంగా కడిగి, నీరు లేకుండా పూర్తిగా వడకట్టాలి. ముదురు కాడలను తీసివేసి, లేత కాడలతో సహా పాలకూరను వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా తరగడం వల్ల ఉల్లికారంలో పాలకూర బాగా మగ్గి, ముద్ద కూరలా రుచికరంగా వస్తుంది.
2. ఉల్లికారం తయారీ:
ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు (పొట్టు తీయకుండా వేస్తే రుచి బాగుంటుంది), కారం , రుచికి సరిపడా ఉప్పు వేయాలి. వీటిని మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా, ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడా తగిలేలా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. పోపు , ఉల్లికారం వేయించడం:
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు (ఆవాలు, జీలకర్ర, పప్పులు) వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న ఉల్లికారాన్ని ఈ పోపులో వేసి లో ఫ్లేమ్ మీద బాగా వేయించాలి. ఉల్లికారంలోని పచ్చి వాసన పోయి, నూనె పైకి తేలే వరకు వేయించడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది.
4. పాలకూరతో వండటం:
ఉల్లికారం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి బాగా కలపాలి. పాన్‌పై మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి. పాలకూర బాగా మగ్గిన తర్వాత పసుపు, ధనియాల పొడి , జీలకర్ర పొడి వేసి మరో నిమిషం పాటు వేయించాలి.
కూరలోని తేమ తగ్గి, నూనె సైడ్స్ నుంచి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పాలకూర ఉల్లికారం సిద్ధం. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా లేదా చపాతీతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది.
తాజావార్తలు
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!