Trump: వెనిజులా, ఇరాన్ తర్వాత నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్.. ఆ దేశం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం
- వెనిజులా, ఇరాన్ తర్వాత అమెరికా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్
- నౌకను చూడగానే దేశం లొంగిపోవాల్సిందే
- క్యూబాకు ట్రంప్ అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ ఏడాది ప్రారంభంలో వెనిజులాను టార్గెట్ చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను లొంగదీసుకుంది. అనంతరం ఫిబ్రవరి 28న ఇరాన్‌పై దాడి చేసి అగ్ర నేతలందరినీ అంతమొందించింది. హార్ముజ్‌ను దిగ్బంధించి ఇరాన్‌ను ముప్పు తిప్పలు పెడుతోంది. తాజాగా అగ్ర రాజ్యం అమెరికా మరొక దేశాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు స్పాట్ ఫిక్స్ చేసింది. లేటెస్ట్‌గా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆపరేషన్ క్యూబా చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. వెంటనే క్యూబాను స్వాధీనం చేసుకోబోతున్నామని.. ఇరాన్ నుంచి తిరిగి వచ్చే దారిలో ఆపరేషన్ పూర్తవుతుందని స్పష్టం చేశారు. తక్షణమే క్యూబా నాయకత్వం లొంగిపోవాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం విధించారు.
‘‘నేను అక్కడికి ఒక నౌకను పంపిస్తే చాలు. వారు లొంగిపోతారు.’’ అని అన్నారు. అమెరికా త్వరలో క్యూబాను ఆక్రమించుకుంటుందని అన్నారు. ఫ్లోరిడాలోని పామ్ బీచెస్‌లోని ‘ఫోరమ్ క్లబ్’లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యక్రమానికి హాజరైన మాజీ ప్రతినిధి డాన్ మైకాను ఉద్దేశించి ట్రంప్ ఈ విషయాన్ని లేవనెత్తారు. ‘‘డాన్ స్వస్థలం క్యూబా. దానిని మనం దాదాపు వెంటనే ఆక్రమించుకోబోతున్నాం.’’ అని అన్నారు.
Also Read
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
- Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!
- US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
- Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
క్యూబాలోని ప్రస్తుత పరిస్థితిపై వ్యాఖ్యానిస్తూ.. అక్కడ చాలా సమస్యలు ఉన్నాయన్నారు. అయితే తాను ఒకేసారి అనేక రంగాల్లో పోరాడటానికి ఇష్టపడటం లేదని స్పష్టం చేశారు. అమెరికా తన సైనిక శక్తిని ఉపయోగించి పెద్ద సంఘర్షణ లేకుండానే క్యూబాను లొంగదీసుకోగలదని అన్నారు. ‘‘మేము ఇరాన్ నుంచి వైదొలగినప్పుడు.. మా దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక అయిన యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఉంటుంది. క్యూబా తీరానికి కేవలం 100 గజాల దూరంలో దానిని మేము నిలిపివేస్తాం.’’ అని అన్నారు. అమెరికా యుద్ధనౌకను చూడటమే చాలు. ఆయన ఇంకా చమత్కరిస్తూ.. ‘‘వారు (క్యూబన్లు) దాన్ని చూసి.. ‘‘మీకు చాలా ధన్యవాదాలు.మేము లొంగిపోతున్నాం.’’ అని చెబుతారని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..