Riyan Parag: మీకు అవసరం లేదు.. వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు!
- ఐపీఎల్ 2026లో పెద్ద చర్చనీయాంశంగా వేప్ వివాదం
- డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగుతూ దొరికిన పరాగ్
- వేప్ వివాదంపై పరాగ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RR Captain Riyan Parag React on Vape Controversy: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కెప్టెన్ రియాన్ పరాగ్ చుట్టూ వేప్ (ఈ-సిగరెట్) వివాదం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ-సిగరెట్ తాగుతూ కెమెరాలకు చిక్కాడు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పరాగ్‌పై ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు ఓ డిమెరిట్ పాయింట్ చేర్చారు. పరాగ్ తన తప్పును అంగీకరించడంతో… ఎలాంటి విచారణ అవసరం లేకుండా పోయింది.
ఈ-సిగరెట్ అంశంపై అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో విభిన్న విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అనంతరం రియాన్ పరాగ్ స్వయంగా స్పందించాడు. తాను విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనని, తన దృష్టి పూర్తిగా ఆటపైనే ఉందని స్పష్టం చేశాడు. ‘ఈ విషయంపై విమర్శకులకు లేదా ఇతరులకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను. రోజు చివరికి నా పని జట్టుకు రెండు పాయింట్లు అందించడమే. బయట జరిగే వివాదాలపై నేను ఫోకస్ చేయను. జట్టుగా విజయం సాధించడం ముఖ్యం. వ్యక్తిగత అంశాలు నా దృష్టి మరల్చలేవు’ అని పరాగ్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రియాన్ పరాగ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సులతో 90 రన్స్ చేశాడు. ఎట్టకేలకు ఫామ్ అందుకుని కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా.. రాజస్థాన్‌ను గెలిపించలేకపోయాడు. ఈ నేపథ్యంలో తన వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయం ముఖ్యమని పరాగ్ తెలిపాడు. ‘నేను ఎంత బాగా ఆడినా జట్టు ఓడిపోతే ఆ ఇన్నింగ్స్‌కు విలువ ఉండదు. భారీ స్కోర్ చేసినా ఓడినందుకు బాధగానే ఉంది. మాకు ఇప్పుడు ఒక వారం విరామం ఉంది. ఆ సమయంలో వివాదంను క్లియర్ చేస్తాం. ప్రస్తుతం రాజస్థాన్ ప్లేఆఫ్స్ రేస్‌లో ఉంది. కాబట్టి జట్టు ఫోకస్ మొత్తం మ్యాచ్‌లపై ఉంది’ అని పరాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Garlic-Onion Chutney Recipe: వెల్లుల్లి, ఉల్లిపాయతో ఘాటైన చట్నీ.. రోటీ, అన్నంతో అదిరిపోతుంది.. కూర లేకపోయినా పర్లేదు..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!