Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ragi Sweet Roti: ఉరుకుల పరుగుల జీవితంలో సరైన పోషకాహారం లేక చాలామంది జుట్టు రాలడం, రక్తహీనత, నీరసం వంటి అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి మన బామ్మల కాలం నాటి ‘రాగి తీపి రొట్టెలు’ ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ సంప్రదాయ వంటకాన్ని సింపుల్‌గా ఎలా తయారు చేయాలో, దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రాగి తీపి రొట్టెలకు కావాల్సిన పదార్థాలు:
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
- Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
రాగి పిండి: 2 కప్పులు
బెల్లం తురుము: 1 కప్పు (తీపికి సరిపడా)
నీళ్లు: తగినంత
కొబ్బరి తురుము: అర కప్పు (రుచి కోసం)
యాలకుల పొడి: కొద్దిగా
నెయ్యి: కాల్చడానికి తగినంత
తయారీ విధానం..
మొదట ఒక పాత్రలో బెల్లం తురుము తీసుకుని, అందులో కొద్దిగా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి కరిగించాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. కరిగిన బెల్లం నీటిని వడకట్టి, అందులో రాగి పిండి, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. పిండి మరీ గట్టిగా కాకుండా, చేత్తో రొట్టెలా ఒత్తుకోవడానికి వీలుగా ఉండాలి. ఒక అరటి ఆకు లేదా ప్లాస్టిక్ పేపర్ మీద కొంచెం నెయ్యి రాసి, చిన్న పిండి ముద్దను తీసుకుని పల్చగా రొట్టెలా వత్తాలి. పెనం వేడి అయ్యాక, నెయ్యి వేసి ఈ రొట్టెను రెండు వైపులా ఎర్రగా కాలే వరకు కాల్చుకోవాలి. అంతే సింపుల్ ఈ రొట్టెలు రెడీ అయిపోయాయి.
రాగి రొట్టె ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
రాగుల్లో – బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది. ఇందులోని పోషకాలు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని అరికడతాయి. రాగుల్లో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ ఉదయం టిఫిన్ రూపంలో లేదా సాయంత్రం స్నాక్‌లా ఈ రాగి తీపి రొట్టెలను తీసుకుంటే మీ ఆరోగ్యంలో అద్భుతమైన మార్పును గమనించవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ఇంట్లో సమయం ఉన్నప్పుడు తప్పకుండా ప్రయత్నించండి.
తాజావార్తలు
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
-
Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!