Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్‌ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kyle Jamieson: రాజస్థాన్ రాయల్స్ (RR), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగిన మ్యాచ్‌లో మరోసారి వైభవ్ సూర్య వంశీ హాట్‌టాపిక్‌గా మారాడు. తన బ్యాట్‌తో మెరుపులు మెరిపించే వైభవ్ ఈ సారి కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. జేమీసన్ వేసిన ఒక అద్భుతమైన యార్కర్‌కు వైభవ్ నిస్సహాయుడయ్యాడు. ఇక, కేవలం 15 ఏళ్ల వయసున్న రాజస్థాన్ యువ సంచలనం వైభవ్‌ని అవుట్ చేసిన తర్వాత ఢిల్లీ బౌలర్ కైల్ జేమీసన్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైభవ్ ముందే గట్టిగా చప్పట్లు కొడుతూ, అత్యంత దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ అంశంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. “అతడికి ఇంకా 15 ఏళ్లే, కొంచెం నిదానం జేమీసన్” అంటూ నెటిజన్లు క్లాస్ పీకుతున్నారు. అంత చిన్న వయసున్న ప్లేయర్ పట్ల అంతటి అగ్రెషన్ చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఈ సెలబ్రేషన్స్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వరుసగా మూడు ఓటముల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఎట్టకేలకు విజయపథంలోకి అడుగు పెట్టింది. శుక్రవారం జైపూర్‌లో జరిగిన రసవత్తర పోరులో రాజస్థాన్ రాయల్స్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాజస్థాన్ నిర్దేశించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఢిల్లీ బ్యాటర్లు ఎంతో చాకచక్యంగా ఛేదించారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఓపెనర్లు కేఎల్ రాహుల్, పాతుమ్ నిస్సాంక అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు కేవలం 110 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపు పునాది వేశారు. రాహుల్ 40 బంతుల్లోనే 75 పరుగులు చేయగా, నిస్సాంక 33 బంతుల్లో 62 పరుగులతో విరుచుకుపడ్డారు. చివరిలో ట్రిస్టన్ స్టబ్స్ (18 నాటౌట్), అశుతోష్ శర్మ (25 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), వైభవ్ సూర్యవంశీ (4) తొలి రెండు ఓవర్లలోనే అవుట్ కావడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది. అయితే, ఈ సీజన్‌లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న కెప్టెన్ రియాన్ పరాగ్ (90 పరుగులు, 50 బంతుల్లో) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. గత మ్యాచ్‌లో ‘వేపింగ్’ చేస్తూ దొరికిపోయి జరిమానా ఎదుర్కొన్న పరాగ్, ఈ మ్యాచ్‌లో ధ్రువ్ జురెల్ (42)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. చివరి ఓవర్లలో డొనొవాన్ ఫెరీరా కేవలం 14 బంతుల్లో 47 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో రాజస్థాన్ స్కోరు 200 దాటింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు, అందులో కీలకమైన పరాగ్ వికెట్ ఉంది. భారీ స్కోరు చేసినప్పటికీ, ఢిల్లీ బ్యాటర్ల ధాటికి రాజస్థాన్ బౌలర్లు నిలవలేకపోయారు.
The celebration of Kyle Jamieson after dismissing Vaibhav Suryavanshi. pic.twitter.com/s6Otq9Uu0X
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 1, 2026
Calm down Jamieson, he is just 15 y/o 😭🙏🏻 pic.twitter.com/RtvBMwBYXS
— Shivani (@meme_ki_diwani) May 1, 2026
Kyle Jamieson Celebration 🤣🤣🤣 against 15 Years Old Kid
— Junaid Khan (@JunaidKhanation) May 1, 2026
Jamieosn bro Sending off a 15 year old child is not a good thing! 😡
I can't believe you're from New Zealand.
— Shariq (@CricBhakt7380) May 1, 2026
తాజావార్తలు
-
Petrol-Diesel Price: హార్ముజ్‌లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
-
CM Chandrababu: ‘నిజం గెలిచింది’.. ప్రజల కోసం నిలబడితే ప్రజలే మన వెంట నిలబడతారు..
-
India-Sri Lanka: భారత్‌కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!