IND vs ENG: విశాఖలో క్రికెట్ సందడి.. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు భారీగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ క్రికెట్ అభిమానులతో సందడిగా మారిపోయింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి రోడ్డు మార్గాన రాడిసన్ బ్లూ హోటల్ కి వెళ్లిపోయారు.
MPs Suspension: బడ్జెట్‌కు ముందు కేంద్రం కీలక నిర్ణయం.. విపక్ష ఎంపీల సస్పెన్షన్ రద్దు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ఇదిలా ఉంటే.. డాక్టర్ వైస్ రాజశేఖర్‌రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు కూడా ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించనుంది. అదే విధంగా.. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు రోజుకు 2 వేల మంది చొప్పున 5 రోజులకు 10 వేల మంది విద్యార్థులకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉచిత ప్రవేశం కల్పించనుంది. అంతేగాకుండా.. రాష్ట్రంలో ఉన్న క్లబ్ క్రీడాకారులు కూడా.. రోజుకు 2,850 మంది చొప్పున.. 5 రోజులకు 14,250 మంది ఫ్రీగా మ్యాచ్ చూసే అవకాశం ఇవ్వనుంది.
Stock Markets: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 801, నిఫ్టీ 215 పాయింట్లు పతనం
కాగా.. హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 28 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.. దీంతో వైజాగ్ లో గెలుపే లక్ష్యంగా టీమిండియా సన్నద్ధమవుతోంది. సిరీస్ ను 1-1తో సమం చేయాలని భారత్ భావిస్తోంది. అయితే బ్యాటింగ్ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో మార్పులు చేయనున్నారు. మూడు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!