Jaiswal vs Gill: టీమిండియా టెస్టు జట్టులో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇన్నింగ్స్ 92వ ఓవర్‌ను జైదెన్ సీలెస్ వేశాడు. ఆ ఓవర్ సెకండ్ బంతిని యశస్వీ జైస్వాల్ మిడాఫ్ వైపు కొట్టాడు. ఈజీగా పరుగు వస్తుందని భావించిన యశస్వి రన్నింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. మరోవైపు గిల్ మాత్రం అతడి పిలుపును పట్టించుకోకపోవడంతో.. అప్పటికే సగం పిచ్‌కు పైగా దాటిన జైస్వాల్ రిటర్న్ అయ్యేలోపు రనౌట్ అయ్యాడు.
అడిలైడ్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డే-నైట్ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలిరోజే క్రికెట్ ఆస్ట్రేలియాపై సోషల్ మీడియాలో విరుచుకు పడుతున్నారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రెండుసార్లు లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో.. భారత ఆటగాళ్లు, అంపైర్లు అసౌకర్యానికి గురయ్యారు. మ్యాచ్ మధ్యలో పవర్ కట్ కారణంగా రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది.
డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో భారత్-ఆస్ట్రేలియా మధ్య డే/నైట్ టెస్టు జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ ముందు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ గాయపడటం జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌లో స్మిత్ గాయపడ్డాడు. నెట్స్‌లో మార్నస్ లబుషేన్ వేసిన త్రో పడుతుండగా అతని వేలికి గాయమైంది.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తున్నాడు. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అతను ఆడలేదు. తనకు కొడుకు పుట్టడం వల్ల ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే.. సెకండ్ టెస్టుకు ఆడబోతుండటంతో.. రోహిత్ శర్మ ఎప్పటిలాగే ఓపెనర్‌గా దిగుతాడు అనుకున్నారు.
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. క్రీజులో షాద్ మాన్ ఇస్లాం (7), మోమినుల్ హక్ ఉన్నారు. కాగా.. రెండు వికెట్లను స్పిన్ మాయజాలం అశ్విన్ పడగొట్టాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 26 పరుగుల వెనుకంజలో ఉంది. కాగా.. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది.
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే.. ఈ మ్యాచ్ ముగియాల్సిన సమయం కంటే ముందుగానే ముగిసిపోయింది. కారణమేంటంటే.. వర్షం ఆటంకం కలిగించింది. స్టేడియం వర్షం పడి కొంత చిత్తడిగా ఉంటడంతో ఆట ఒక గంట ఆలస్యంగా మొదలైంది. లంచ్ విరామం తర్వాత కొంతసేపు మ్యాచ్ జరిగింది. ఇంతలో మళ్లీ వర్షం పడింది. చాలా సేపటి వరకూ వర్షం తగ్గకపోవడంతో తొలి రోజును ఆటను అంపైర్లు ముగించారు.
ఉప్పల్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయిన టీమిండియా.. రెండో టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతుంది. అందుకోసం ఇండియా-ఇంగ్లాండ్ విశాఖకు చేరుకున్నాయి. దీంతో విశాఖలో క్రికెట్ సందడి వాతావరణం నెలకొంది. ఫిబ్రవరి 2 నుంచి 6 వరకు పీఎం పాలెంలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగననుంది. అందుకోసం.. ప్రత్యేక విమానంలో ఇండియా, ఇంగ్లాండ్ క్రికెటర్స్ విశాఖ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు. దీంతో…
తొలిసారి సఫారీ గడ్డపై సిరీస్ గెలిచేందుకు బరిలోకి దిగిన భారత జట్టు పేలవ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు ప్రతీకారం తీర్చుకునేందుకు మరో ఛాన్స్ వచ్చింది. మరోవైపు సొంతగడ్డపై జోరు మీదున్న సఫారీ జట్టు క్లీన్‌స్వీప్ చేసేందుకు రెడీ అవుతుంది.
కేప్ టౌన్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. జనవరి 3 నుంచి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం టీమిండియా కసరత్తు ప్రారంభించింది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండో టెస్ట్ లో విజయం సాధించాలనే ఉద్దేశంతో టీమ్ రంగంలోకి దిగనుంది. ఇదిలా ఉంటే.. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో భారత్ రికార్డు బాగోలేదు. దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన ఒక్క టెస్టు మ్యాచ్‌లో కూడా టీమిండియా గెలవలేదు.