BV Raghavulu: తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదు.. బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BV Raghavulu: మోదీకి, అమిత్ షా కి తెలీకుండా చంద్రబాబును బొక్కలో వేయలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. జనసేన నాయకుడు మోడీని పొగడటమే సరిపోయింది బీసీ సభలో అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మరల మూడోసారి మోడీ రావాలని పవన్ కళ్యాణ్ కోరారని.. మోడీ రాజకీయాలు నచ్చాయట పవన్ కళ్యాణ్‌కు అంటూ బీవీ రాఘవులు పేర్కొన్నారు. పవన్‌తో కామన్ మేనిఫెస్టో తెస్తున్న టీడీపీ కూడా బీజేపీ చెంతకే చేరుతుందన్నారు. మోడీ కాదా అమరావతి రాకుండా చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మోడీ రాజకీయాలు ఏపీకి నష్టం చేస్తాయన్నారు. రాజ్యాంగాన్ని నాశనం చేస్తున్న మోడీ కాళ్ళు మొక్కే వాడు అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభిస్తాడా అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: Tummala Nageswara Rao : నాకు పదవులు అవసరం లేదు.. జిల్లా అభివృద్ధి కోసమే బరిలో ఉన్నా
Also Read
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
- Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
సామాజిక సాధికారత యాత్రలు కావు.. సామాజిక సంహార యాత్రలు అవి అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. సమాజానికి కావాల్సిన అంశాలు తీసేస్తే మాట్లాడని వాళ్ళు సామాజిక సాధికారత యాత్రలు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నలు గుప్పించారు. అమెరికాకి వెళ్ళే వారికి ఇంగ్లీషు చదువులు కావాలి… మాకు అక్కర్లా అంటూ బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ బ్యాంకు నుంచీ తీసుకున్న అప్పుతో ఇంగ్లీషు చదువులు పెట్టాడు.. ఆ 2వేల కోట్లు మెక్కడానికే అంటూ ఆయన ఆరోపించారు. ఎన్డీఏ చేసిన ద్రోహంతో 20 ఏళ్ళు వెనక్కి పోయామన్నారు. ఏపీలో బీజేపీ ఉనికి లేదని.. కానీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ కాళ్ళకు మొక్కుతోందన్నారు. ఇక్కడ ఎలా మాట్లాడుకున్నా.. టీడీపీ, వైసీపీ కలిసి బీజేపీకి పార్లమెంటులో మద్దతిస్తాయని ఆయన అన్నారు.
తెలంగాణలో సీపీఐ, సీపీఎం విడిపోలేదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. తెలంగాణలో సీపీఐ పోటీ చేసే ఒక స్ధానంలో మద్దతిస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. సీపీఐ, కాంగ్రెస్ ఒడంబడికతో మేం తెలంగాణలో అంగీకరించలేదన్నారు. సీపీఐకి టీడీపీ మీద ఆశ ఉందన్నారు. కాంగ్రెస్ ఏపీలో పెద్ద శక్తి ఏమీ కాదని.. రఘువీరా, రామకృష్ణ వేదికలకు పెద్ద విలువ ఏం లేదన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడే శక్తులు ఏపీలో కనబడటం లేదన్నారు. టిడిపి, వైసీపీ ఎన్డీయే కూటమిలో చేరాలని చూస్తున్నాయన్నారు. రాజకీయ ప్రత్యామ్నాయంగా ఉండేలా మూడు పార్టీలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించామని బీవీ రాఘవులు వెల్లడించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గం తెలుపుతూ సీపీఎం సభలు జరిగాయన్నారు. టిడిపి, వైసీపీ పాలనల్లో ఏపీ వెనకబడిపోయిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!