Chiru: బాలయ్య డైరెక్టర్ తో మెగా 157?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ తర్వాత ‘భోళా శంకర్’తో ఫ్లాప్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే బింబిసార వంటి హిట్ ఇచ్చిన యంగ్ డైరెక్టర్ వశిష్టతో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేశారు. రీసెంట్‌గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. త్వరలోనే మెగాస్టార్ మెగా 156 షూటింగ్‌లో జాయిన్ అవనున్నారు. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ కృష్ణతో మెగాస్టార్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తారనే టాక్ మాత్రమే ఉంది కానీ ఈ కాంబో ఇప్పట్లో వర్కౌట్ అయ్యేలా లేదు. దీంతో మరో హిట్ డైరెక్టర్‌తో మెగా 157 లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నాడు.
ఇప్పటి వరకు ఫ్లాప్ చూడని అనిల్ రావిపూడి.. రీసెంట్‌గా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు చిరుతోనే సెట్ చేస్తున్నట్టుగా సమాచారం. చాలా రోజులుగా ఈ కాంబో గురించి వినిపిస్తున్నప్పటికీ… ఇప్పుడు దాదాపుగా ఓకే అయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కథకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయట. చిరుకు లైన్ నచ్చిందట… ఓసారి ఫైనల్ వెర్షన్ విన్నాక స్క్రిప్టు లాక్ చేయనున్నారట. ఆ తర్వాతే అఫిషీయల్ అనౌన్స్మెంట్ రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్టుగా ఇండస్ట్రీ ఇన్‌సైడ్ టాక్. కెరీర్ స్టార్టింగ్ నుంచి వినోదాత్మకమైన సినిమాలను తెరకెక్కించడంలో అనిల్ రావిపూడి దిట్ట. దీంతో మెగాస్టార్‌తో అదిరిపోయే ఎంటర్టైనర్ చేయబోతున్నట్టుగా సమాచారం.
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!