అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’ (ఆదర్శ కుటుంబం). వీరి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్‌ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం రోజులు ఆలస్యంగా, అంటే అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధికారికంగా వెల్లడించింది.
“కాస్త ఆలస్యంగా వస్తున్నాం.. కానీ అందించే వినోదం మాత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ రేంజ్లో బద్దలవుతుంది” అని చిత్ర యూనిట్ భరోసా ఇచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజీ పడకూడదనే ఉద్దేశంతో పాటు, పండుగ సెలవులను పకడ్బందీగా ఒడిసిపట్టేలా మేకర్స్ ఈ కీలక మార్పు చేసినట్లు ట్రేడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వెంకటేష్ కెరీర్లో 77వ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా హీరో నారా రోహిత్ ఒక కీలక పాత్రలో మెరవనుండటం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ భారీ ఎంటర్టైనర్కు ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. కుటుంబ కథా చిత్రాలకు తనదైన పంచ్ డైలాగ్స్ జోడించి బాక్సాఫీస్ హిట్స్ కొట్టడంలో త్రివిక్రమ్‌కు తిరుగులేదు. మరి వారం వెనక్కి జరిగిన ఈ ‘AK47’ దసరా బరిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Dulquer Salmaan: "టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా"
- Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
- Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
- Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
#AK47 will be arriving a week later, but we promise you… BLOCKBUSTER ENTERTAINMENT! 🔥❤️#AadarshaKutumbam 🏠 now arrives in theatres on OCTOBER 9th! 💥💥#AK47OnOct9th 🔥#Venky77 | #VenkateshXTrivikram |
Victory @VenkyMama #Trivikram @SrinidhiShetty7 @IamRohithNara… pic.twitter.com/gFdaK0wqYU
— Haarika & Hassine Creations (@haarikahassine) September 22, 2026
తాజావార్తలు
-
Pulivendula Re-Polling: రీ-పోలింగ్‌పై గందరగోళం.. పులివెందులలో ఇంకా తెరుచుకోని పోలింగ్ కేంద్రం!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!
-
Shreyas Iyer: మేము చెత్తగా ఆడాం, చాలా తప్పులు చేశాం.. న్యూజిలాండ్ ఓటమిపై శ్రేయస్ కీలక వ్యాఖ్యలు!
-
India Renewable Energy Summit 2026: ప్రధాని మోడీ చేతుల మీదుగా.. నేడు ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్ 2026 ప్రారంభం
-
Murusu Cyclone Alert: దూసుకొస్తున్న మురసు తుఫాన్.. నేడు అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
ట్రెండింగ్
-
IND vs NZ: వన్డే సిరీస్‌కు ముందు బిగ్ షాక్.. ఆ స్టార్ ప్లేయర్స్ సిరీస్ నుండి అవుట్.!
-
SOS బటన్, Family Assist ఫీచర్లtho ‘సీనియర్ సిటిజన్ల’ కోసం Nokia 2360 Flip ఫోన్ లాంచ్..!
-
Jio vs Airtel vs Vi: కేవలం వాయిస్ కాల్స్ కోసమే రీఛార్జ్.. ఏ కంపెనీ ప్లాన్ బెస్ట్.?
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు