Kayadu Lohar: రూమర్స్‌కి, నా రోల్‌కి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా.. ‘ది ప్యారడైజ్’ పాత్రపై కయాదు షాకింగ్ కామెంట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kayadu Lohar: న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో నానికి జోడీగా నటిస్తున్న యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ పాత్రపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ముఖ్యంగా ఆమె ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా కనిపించబోతోందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఈ రూమర్లపై కయాదు స్వయంగా స్పందిస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది.
ఈ సినిమా ప్రమోషన్ల ఇంటర్వ్యూలో తన పాత్ర గురించి వస్తున్న ఊహాగానాలను ఆమె కొట్టిపారేసింది. “ప్రస్తుతం నెట్టింట నడుస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. నేను ఈ చిత్రంలో జర్నలిస్ట్ రోల్ చేయడం లేదు. అసలు జర్నలిజానికి, నా క్యారెక్టర్‌కి ఎలాంటి సంబంధమూ ఉండదు” అని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన రోల్ గురించి మాట్లాడుతూ.. “ప్రేక్షకులు బయట ఏదేదో కథలు ఊహించుకుంటున్నారు. కానీ వాళ్లు అనుకుంటున్న దానికి, తెరపై కనిపించబోయే పాత్రకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమాలో కథానాయికను ఇప్పటివరకు ఇలాంటి రోల్లో ఎవరూ చూసి ఉండరు. నా క్యారెక్టర్ పూర్తిగా భిన్నంగా, అనూహ్యమైన మలుపులతో సాగుతుంది” అని పేర్కొంది. రిలీజ్‌కు ముందే ఇలాంటి పాత్రపై అభిమానులు సొంత సిద్ధాంతాలు అల్లేసుకుంటారని, అయితే థియేటర్లలో తన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది. కయాదు ఇచ్చిన ఈ క్లారిటీతో ‘ది ప్యారడైజ్’లో ఆమె రోల్ చుట్టూ ఉన్న సస్పెన్స్ మరింత పెరిగింది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?