Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. మిగతా విషయాలు అన్ని పక్కన పెడితే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చాలా సార్లు మహేష్ వలనే ఆగిపోతుందని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అందుకు కారణం మహేష్ వెకేషన్స్. షెడ్యూల్ పూర్తి కావడం ఆలస్యం.. మహేష్ వెకేషన్ ను చెక్కేస్తున్నాడు. మధ్యలో కూతురు బర్త్ డే అని, ఇంకొకసారి పెళ్లి రోజు అని.. మరికొన్ని రోజులు సమ్మర్ వెకేషన్ అని.. ఇలా సగానికి సగం షెడ్యూల్స్ మొత్తం మహేష్ వెకేషన్స్ కే పోతుందని చెప్పుకొస్తున్నారు. వెకేషన్ నుంచి మహేష్ రావడం.. కొత్త షెడ్యూల్ కు సంబంధించిన కథను చెప్పడం.. అది నచ్చక మళ్లీ త్రివిక్రమ్ మార్చడం.. గత కొన్నిరోజులుగా ఇదే తంతు నడుస్తుందని చెప్పుకొస్తున్నారు.
Jagapathi Babu: ఎప్పుడు తొక్కే.. త్రివిక్రమ్ చెప్పిన డైలాగ్ గుర్తొచ్చింది
షూటింగ్ ఇంకా 50 % కూడా పూర్తికాలేదని టాక్ నడుస్తోంది. ఇలాచేస్తే సంక్రాంతికి అస్సలు సినిమా రిలీజ్ అవుతుందా.. ? అనే అనుమానం అభిమానుల్లో కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే మహేష్ ఇండియాకు తిరిగివచ్చి షూటింగ్ మొదలుపెట్టాడు. ఇక ఈరోజు కూడా అనగా సండే కూడా మహేష్ షూటింగ్ లో పాల్గొన్నాడట. రమ్యకృష్ణ డేట్ అడ్జెస్ట్ అవ్వలేదు అని వస్తున్న వార్తల్లో కూడా నిజం లేదని సమాచారం. ప్రస్తుతానికి అయితే గుంటూరు కారం శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. సండే, మండే అని తేడా లేకుండా చేస్తేనే సినిమా అవుతుంది.. ఇప్పుడు కూడా చేయకపోతే సినిమా రిలీజ్ అవ్వదు బ్రో.. అని కామెంట్స్ పెడుతున్నారు.