CPI Narayana: చెప్పి మరీ చంపేస్తున్నారు.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు
- బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు
- బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉంది
- బీజేపీ కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారు- నారాయణ
- చెప్పి మరీ చంపేస్తున్నారు- నారాయణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని తెలిపారు. దేశంలో చాలా తక్కువ శాతం ఉన్న మతాల పరిస్థితి ఉందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని ఆరోపించారు. బీజేపీ కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. చెప్పి మరీ చంపేస్తున్నారని అన్నారు. రూరల్ నుంచి అర్బన్ కి వచ్చారు.. అర్బన్ నక్సల్స్ అంటున్నారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
Read Also: Posani Case : పోసాని కృష్ణ మురళి కేస్ అప్డేట్
Also Read
మనం ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం.. మోడీ సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పునర్విభజన ద్వారా ఎక్కడ పెరుగుతుంది.. తగ్గుతుంది అనే లాభనష్టాలను బేరీజు వేసుకుని చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో ఫెడరలిజం లేకపోయినా పర్వాలేదు.. బీజేపీ అధికారంలో ఉండాలని ఆలోచిస్తోందని తెలిపారు. కాగా.. ఏప్రిల్ 25 నుంచి జాతీయ సమావేశాలకు వెళ్తున్నాం.. అందులో మరిన్ని విషయాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీపీఐ నారాయణ తెలిపారు.
Read Also: MP Laxman: భారత్ ఎదుగుదలలో మహిళలే కీలకం కావాలి..
మరోవైపు.. డీలిమిటేషన్ పై నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కువమంది పిల్లలను కనమని పిలుపునివ్వడం రాజకీయ దివాలాకోరుతనమేనని అన్నారు. ఎక్కువమంది పిల్లలను కనడానికి మహిళలేమైనా ఉత్పత్తి పరిశ్రమలా అని ప్రశ్నించారు. వ్యవస్తీకృత హింసకు మహిళలే సమిధలని.. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!