CPI – Congress Alliance: కటీఫ్ చెప్పిన సీపీఎం.. ఇక, సీపీఐ వంతు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI – Congress Alliance: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల వ్యవహారం కాక రేపుతోంది.. బీఆర్ఎస్ ఒంటరిగా బరిలోకి దిగగా.. బీజేపీ-జనసేన కలిసి వెళ్లాలని నిర్ణయించాయి.. అయితే, జనసేన సీట్ల వ్యవహారం తేలాల్సి ఉంది.. మరోవైపు.. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేస్తాయనే ప్రచారం ఆది నుంచి జరుగుతూనే ఉంది.. దీని కోసం కమ్యూనిస్టులతో కాంగ్రెస్ నేతలు చర్చలు కూడా జరుపుతూ వచ్చారు.. కానీ, సాగదీత దోరణితో విసుగుచెందిన సీపీఎం.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. 17 చోట్ల పోటీకి సిద్దమని ప్రకటించింది. ఇక సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం.
మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ సీట్లు ఇస్తామని చెప్పి.. కాంగ్రెస్ హ్యాండివ్వడంతో పొత్తుపై వెనక్కి తగ్గింది సీపీఎం. పైగా కాంగ్రెస్ నేతలు అవమానకరంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు. 17 చోట్ల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. మొదట్లో ఐదు స్థానాలను ఆశించిన సీపీఎం.. తగ్గుతూ వచ్చింది. కనీసం రెండు చోట్లయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. పాలేరు సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్‌ను కోరారు సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం. అయితే మిర్యాలగూడ, వైరా సీట్లను ఇస్తామని హామీ ఇచ్చి మాట మార్చారు కాంగ్రెస్ నేతలు. మిర్యాలగూడ లేదా హైదరాబాద్‌లో ఏదో ఒకచోటు నుంచే పోటీ చేయాలని సూచించడంతో పొత్తు ప్రయత్నాలను విరమించుకున్నారు.
Also Read
- 200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
ఇక, సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్టు కాంగ్రెస్ నేతలు చెప్పినా.. మారన రాజకీయ పరిస్థితులు, బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది.. చెన్నూరు అసెంబ్లీ స్థానాన్ని వివేక్ కు కేటాయించే అవకాశం ఉండడంతో.. సీపీఐ కూడా డైలామాలో పడిపోయింది.. దీంతో.. కాంగ్రెస్‌తో తేల్చుకునేందుకు సిద్ధమైంది సీపీఐ.. ఇప్పటికే సీపీఎం కటీఫ్ చెప్పడంతో.. సీపీఐ కూడా అదే దారిలో నడుస్తుందనే చర్చ సాగుతోంది.. అయితే, కొందరు కాంగ్రెస్ నేతలు కమ్యూనిస్టులకు సీట్లు ఎందుకు.. మా ప్రభుత్వం వచ్చాక.. ఒకటో రెండో ఎమ్మెల్సీలు ఇస్తాం.. ఎమ్మెల్యే సీట్లు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు.. ఏది ఏమైనా.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే.. కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే.. కాదనుకుంటే.. కాంగ్రెస్ పార్టీకే నష్టమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..