సీపీఎం బాటలోనే సీపీఐ కూడా వెళ్లే అవకాశముంది. ఇవాళ జరగనున్న సీపీఐ రాష్ట్ర కమిటీ సమావేశంలో కాంగ్రెస్‌తో పొత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. సీపీఐకి కొత్తగూడెం సీటు ఆఫర్ చేసింది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్‌ను నమ్మలేమంటున్నారు సీపీఐ నేతలు. మరోవైపు, కాంగ్రెస్‌తో కలిసి సీపీఐ పోటీ చేస్తే.. అక్కడ తమ అభ్యర్థిని పోటీకి పెట్టబోమని సీపీఎం తెలిపింది. అలాగే వామపక్షాలు పోటీ లేని స్థానాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తామని ప్రకటించింది సీపీఎం.
Congress First List: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.