ఏపీ సీఎం వైఎస్ జగన్ కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. అసైన్డ్ భూములు పేదలకే దక్కేలా చర్యలు చేపట్టండని ఆయన లేఖలో పేర్కొన్నారు. 20 ఏళ్లు పైబడిన అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయనున్నట్లు తెలుస్తోందని, ఈ అసైన్ చట్ట సవరణ ద్వారా వైసీపీ నేతలు, రియల్టర్లు, భూస్వాములు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్నారు రామకృష్ణ. ఇప్పటికే పరాధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలను గుర్తించి, నిజమైన పేద లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు చేపట్టండని ఆయన కోరారు. ఈ అసైన్ చట్ట సవరణ ద్వారా పలువురు నేతలు, రియల్టర్లు, భూస్వాములు లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే పరాధీనంలో ఉన్న లక్షలాది ఎకరాలను గుర్తించి, నిజమైన పేద లబ్ధిదారులకే అప్పగించేలా చర్యలు చేపట్టాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
Also Read : India Per Capita Income: 2030 సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం 4 వేల డాలర్లు, ఎలా?
ఇదిలా ఉంటే.. ఇటీవల సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి అని రామకృష్ణ డిమాండ్ చేశారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏ ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోగా పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం గాలికి వదిలేసింది అని మండిపడ్డారు. కొత్తగా ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా నిరందించిన దాఖలాలు లేవు అని ధ్వజమెత్తారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి అని విమర్శించారు. ఈ నేపథ్యంలో తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి, ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశారు.
Also Read : Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల మీదుగా మరో వందే భారత్ ట్రైన్.. నేడు ట్రయల్ రన్