Vande Bharat Express: మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా నడవనుంది. ఈ రైలు హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి కర్ణాటకలోని యశ్వంతపుర వరకు నడుస్తుంది. ఏపీలోని నంద్యాల జిల్లా డోన్ మీదుగా ఆగస్టు 6న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణిస్తుందని గంటకల్లు డివిజన్ అదనపు రైల్వే మేనేజర్ వెల్లడించారు. గంటకల్లు డివిజన్‌లో డోన్ రైల్వేస్టేషన్ మొదటిది కావడంతో ఇక్కడ నుంచే ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. ఈరోజు డోన్ నుంచి కాచిగూడ వరకు వందేభారత్ ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డోన్ లో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో గుంతకల్లు డివిజన్ డీఆర్ ఎంతో పాటు వివిధ శాఖల అధికారులంతా పాల్గొంటారని వెల్లడించారు. డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్లలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Read also: Health Tips: పీరియడ్స్ సమయంలో వీటిని తీసుకుంటే నొప్పి, నీరసం క్షణాల్లో తగ్గుతుంది..
తెలుగు రాష్ట్రాల మధ్య కేవలం రెండు వందే భారత్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వరకు మొదటి రైలు కాగా, రెండో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ ఉంది. వాటిలో ప్రయాణించేందుకు ప్రయాణికులు ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ-కర్ణాటక మధ్య మరో వందేభారత్ రైలు నడపాలని గతంలో ప్రతిపాదనలు వచ్చాయి. హైదరాబాద్- బెంగళూరు నగరాల మధ్య రాకపోకలు సాగించే వారు చాలా మంది ఉన్నారు. ఈ నగరాల మధ్య వందే భారత్ రైలును నడిపితే.. రెండు ప్రధాన టెక్ హబ్‌లను అనుసంధానం చేయవచ్చని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ మేరకు కాచిగూడ నుంచి యశ్వంతపురానికి రైలు నడపాలని నిర్ణయించారు. ఏపీలోని పలు స్టేషన్లను కలుపుతూ మూడు రాష్ట్రాలను కవర్ చేయాలని భావించిన రైల్వే శాఖ ఈ రైలును డోన్ మీదుగా నడపాలని నిర్ణయించింది. సికింద్రాబాద్-పుణె మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
Health Tips: పీరియడ్స్ సమయంలో వీటిని తీసుకుంటే నొప్పి, నీరసం క్షణాల్లో తగ్గుతుంది..