ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు అని మోడీ మొదలు పెట్టారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ రాజ్యాంగమే మార్చలేడు మోడీ.. భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఆయన ప్రశ్నించారు. అఖిల పక్షం తో కనీసం మాట్లాడలేదని, కమిటీ బోగస్ అని ఆయన మండిపడ్డారు. అధ్యక్ష బాధ్యతకి అంగీకారం వ్యక్తం చేయడమే రాంనాథ్ కోవింద్ బుద్ది తక్కువ అని ఆయన విమర్శించారు. కమిటీలో అమిత్ షా ఉన్నాకా ఏం చేస్తారని, మేము బైకాట్ చేస్తామన్నారు. రాష్ట్రపతిగా చేసిన రాం నాధ్ కోవింద్ ఈ కమిటీకి బాధ్యత తీసుకోవడం బుద్ది తక్కువ పని అన్నారు. కేసీఆర్.. మూడో కూటమి అంటున్నాడని, ఉట్టికి ఎగరలేనమ్మ.. అన్న చందంగా ఉందంటూ ఆయన సెటైర్లు వేశారు.
Also Read : Daggubati Purandeswari: అధికార పార్టీపై పురందేశ్వరి ఫైర్.. అప్పుల విషయంలో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్
మూడో కూటమి అంటే.. బీజేపీని గెలిపించే వ్యూహంలో భాగమన్నారు. మోడీని.. గవర్నర్ ని ఇష్టం వచ్చినట్టు తిట్టి…. ఇప్పుడు కొత్త డ్రామా అని ఆయన అన్నారు. ప్రధాని చెప్రాసి అని చెప్పి… ఇప్పుడు వాళ్లకు అనుకూల మాటలు మట్లాడుతున్నారన్నారు. ఎంఐఎం కూడా బీజేపీ అనుకూల పార్టీ అని, ఎంఐఎం మీద విచారణ సంస్థల దాడి చేయవు ఎందుకు అని ఆయన అన్నారు. దాడి చేస్తే గుట్టలు గుట్టలు బయటకు వస్తాయని, ఎంఐఎం మీద కొట్లాడింది కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే అని ఆయన అన్నారు. కేసీఆర్ బిడ్డ జైలుకి పోకుండా ఉండటానికి మోడీకి దోస్తీ చేస్తున్నాడన్నారు. చంద్రయాన్ దిగిన చోట శివశక్తి పేరు పెట్టారు మోడీ అని, మణిపూర్ పోవడానికి మోడీ ఎందుకు బయట పడుతున్నాడని ప్రశ్నించారు. బుద్ది ఉన్నోడు ఎవడు బీజేపీ కి ఓటు వేయాడని, G20 ని కూడా బీజేపీ ఓటు కోసం ఉపయోగిస్తుందన్నారు.
Also Read : Asia Cup 2023: టీం ఇండియా పాలిట విలన్ గా మారిన వరుణుడు.. భారత్-నేపాల్ మ్యాచ్‌కు వానగండం