Family Doctor Programme: దేశానికే రోల్ మోడల్ గా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామంలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. గతంలోలా వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఊరిలోనే మీ వద్దనే ఉచిత వైద్యం అందించేలా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఉండనుంది. అందరికీ మంచి ఆధునిక వైద్యం, అదీ ఉచితంగా, అందరికీ తాము ఉంటున్న ఊర్లోనే అందించే కార్యక్రమం, మంచానికే పరిమితమైన రోగులకు సైతం వారి గ్రామంలోనే, వారి గడప వద్దనే అవసరమైన వైద్యం అందజేయాలన్న తపనతో ఫ్యామిలీ డాక్టర్ విధానానికి శ్రీకారం చుట్టారు వైఎస్ జగన్.
ప్రతి మండలానికి కనీసం రెండు పీహెచ్‌సీలు, ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు, ఒక 104 వాహనంతో అనుసంధానం, ఒక డాక్టర్ పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టర్ ప్రతిరోజూ తనకు కేటాయించిన గ్రామాల్లోని వైఎస్సార్ విలేజ్ క్లీనిక్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి వైద్య సేవలు అందిస్తారు. వైద్యుడు తనకు కేటాయించిన అదే గ్రామాన్ని నెలలో కనీసం రెండు సార్లు సందర్శించి వైద్యసేవలు అందిస్తారు. ఒక వైద్యుడు పలుమార్లు అదే గ్రామంలో ఉన్న అదే పేషెంట్‌ను సందర్శించడం ద్వారా ఆ పేషెంట్‌కు డాక్టర్‌కు మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఆ డాక్టర్‌కు ఆ పేషెంట్ హెల్త్ ప్రొఫైల్ మీద పూర్తి అవగాహన ఉండడంతో మెరుగైన చికిత్స అందించడం సులభతరం అవుతుంది. వైద్యునికి ఆ గ్రామంపై పూర్తి అవగాహన, ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తినీ పేరు పేరునా గుర్తించే అవకాశం
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ఇందుకోసం జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చింది 936 మొబైల్ మెడికల్ యూనిట్లను (104 అంబులెన్స్‌లు) నాడు నేడులో భాగంగా ఏర్పాటుచేసిన 10,032 వైఎస్సార్ విలేజ్ క్లీనిక్‌లతో అనుసంధానించడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లీనిక్‌లోని సీహెచ్‌ఓ, ఏఎన్‌ఎమ్, ఆశా కార్యకర్తల సహకారంతో వైద్యసేవలు అందిస్తారు.
ప్రతి విలేజ్ క్లీనిక్‌లో 14 రకాల టెస్టులు, 105 రకాల మందులు అందుబాటు, మరింత మెరుగైన వైద్యం అవసరమైన పేషెంట్లను ఫ్యామిలీ డాక్టర్ వైఎస్సార్ హెల్త్ క్లీనిక్ ద్వారా ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు రిఫర్ చేయడం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందిన రోగులకు చికిత్సానంతర పర్యవేక్షణ కూడా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా, విలేజ్ క్లీనిక్‌లో ఆరోగ్యశ్రీ రిఫరల్ సేవలు కూడా అందిస్తారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో ఏ ఒక్క పోస్టు ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో కొత్తగా 49000 మందికి పైగా వైద్య సిబ్బందిని నియమించిన శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వం. సగటున దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత 61 శాతం ఉంటే మన రాష్ట్రంలో అది కేవలం 4 శాతం మాత్రమే.
Read Also: Bopparaju Venkateswarlu: ఏప్రిల్ 11న సెల్ డౌన్.. అమరావతి జేఏసీ యాక్షన్ ప్లాన్
ఫ్యామిలీ డాక్టర్ అందించే వైద్య సేవలు
సాధారణ వైద్య సేవలు, ప్రసూతి ఆరోగ్య సంరక్షణ సేవలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ సేవలు, రక్తహీనత పరీక్షలు మరియు చికిత్స, అసంక్రమిత వ్యాధులకు ఆరోగ్య పరీక్షలు మరియు చికిత్స, పాఠశాలలో వైద్య కార్యక్రమం, అంగన్‌వాడీ కేంద్ర సందర్శనం, మంచాన ఉన్న రోగుల గృహ సందర్శన
ఫ్యామిలీ డాక్టర్ ఇంకా ఏం చేస్తారంటే..?
దీర్ఘకాలిక వ్యాధుల సర్వే ద్వారా గుర్తించబడిన బి.పి, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి అసంక్రమిత వ్యాధిగ్రస్తులకు (ఎన్‌సీడీ) చికిత్స, రెగ్యులర్ ఫాలోఅప్ మరియు నివారణ ఆరోగ్య సేవలను అందజేయడం ద్వారా వ్యాధి తీవ్రరూపం దాల్చకుండా పర్యవేక్షించడం, ఔటాఫ్ పాకెట్ ఖర్చు తగ్గించడం
* ఈ–సంజీవని వీడియో టెలిమెడిసిన్ సేవల ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల సర్వీసులను గ్రామ స్ధాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావడం
* ఫ్యామిలీ డాక్టర్ అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన ద్వారా పౌష్టికాహార లోపం ఉన్న చిన్నారులు మరియు రక్తహీనత ఉన్న గర్భిణీ స్త్రీలను, బాలింతలను గుర్తించి వారికి చికిత్స అందించడం
* స్కూళ్ళలో విద్యార్ధుల ఆరోగ్య పర్యవేక్షణ, శానిటేషన్, ఆరోగ్యం మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను కూడా చేపట్టడం
* ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న డాక్టర్లు 2,873, వైద్య సిబ్బంది 15,516
* గణనీయంగా పెరిగిన 108,104 వాహనాల సంఖ్య… మొత్తం 1807 వాహనాలు
Read Also: Ravanasura: ఈ పాట వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయే
తాజావార్తలు
-
Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
-
Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!