హైదరాబాద్ జిల్లాలో 15 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. కౌంటింగ్ నేపథ్యంలో.. శనివారం సికింద్రాబాద్ వెస్లీ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం కౌంటింగ్ సెంటర్ ఏర్పాట్లను ముందుగా పరిశీలించారు.
తెలంగాణలో గురువారం ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి ఎన్నికల కౌంటింగ్ ఎల్లుండి (ఆదివారం) జరగనుంది. అందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Counting Centers: అసెంబ్లీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. డిసెంబర్ 3న నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.