Coolie vs War 2 Box Office Collections: ‘వార్ 2’ వర్సెస్ ‘కూలీ’ బాక్సాఫీస్ వార్‌లో రెండో రోజుకే సీన్ రివర్స్ అయిపోయింది. రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ రాగా.. కలెక్షన్స్ పరంగా మొదటి రోజు కూలీ డామినేట్ చేసింది. కానీ రెండో రోజు వార్ 2 డామినేషన్ కనిపించింది. ఆగష్టు 14న సినిమా రిలీజ్ కాగా.. నెక్స్ట్ ఇండిపెండెన్స్ డే హాలీడే కావడం కలిసొచ్చింది. ఇండియాలో మొదటి రోజు 52 కోట్ల నెట్ వసూలు చేసిన వార్ 2.. సెకండ్ డే 56 కోట్లకు పైగా వసూలు చేసింది. దీంతో దేశీయంగా ఈ సినిమా రెండు రోజుల్లో కలిపి 108 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అటు ఓవర్సీస్‌లోను భారీగా వసూళ్లు సాధించింది.
ఇక ఫస్ట్ డే గ్రాస్ పరంగా 151 కోట్లు రాబట్టి తమిళ్ సినిమాల్లో హైయెస్ట్ గ్రాసర్‌గా కూలీ నిలిచింది. కానీ ఇండియా నెట్ వసూళ్ల పరంగా చూస్తే మొదటి రోజు 65 కోట్లు రాబట్టగా.. రెండో రోజు 53 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో కలిపి ఇండియాలో 118 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అటు ఓవర్సీస్లో 10 మిలియన్ డాలర్ మార్క్‌కు చేరువలో ఉంది. అయితే రెండో రోజు రెండు ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు పరిశీలిస్తే.. కూలీ మూవీ కంటే వార్ 2 సుమారు 3 కోట్లు ఎక్కువ వసూల్ చేసింది.
Also Read: Nagarjuna 100 Film: పుట్టినరోజున మైల్స్టోన్ మూవీ అనౌన్స్మెంట్.. నాగ్ లుక్ కూడా సిద్ధం?
అంతేకాదు ప్రస్తుతం వార్ 2 బుకింగ్స్ ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికైతే కూలీ సినిమాకు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. కానీ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో.. రెండో రోజు వసూళ్లు భారీగా డ్రాప్ అయ్యాయి. వార్ 2కి మాత్రం హిందీలో భారీగా వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్ కాబట్టి థియేటర్లో మరో రెండు రోజులు ఈ సినిమాల సందడి ఉండనుంది. సోమవారం నుంచి కూలీ వర్సెస్ వార్ 2కి అసలు సిసలైన పరీక్ష మొదలు కానుంది. మొత్తంగా ఏ సినిమా బాక్సాఫీస్ వార్‌లో నిలుస్తుందో చూడాలి.