Control Room: సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా పరిశ్రమలో జరిగిన ఘోర రియాక్టర్ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం, గాయాలు జరిగిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం యాక్టివ్ అయింది. ఈ నేపథ్యంలో ప్రమాద బాధితుల కోసం ప్రత్యేక సహాయ చర్యల నిమిత్తం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. కంట్రోల్ రూమ్ నంబర్ 08455-276155ను ప్రమాద బాధితుల వివరాలు తెలుసుకోవడానికి, సహాయ చర్యల కోసం ప్రజలు ఈ నంబర్‌కు సంప్రదించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
Read Also:AP Government: ఆ సంస్థకు షాక్.. జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఇక ఘటన అనంతరం పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రికి మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ చేరుకున్నారు. వీరితోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన కార్మికులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమాచారం తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణలోని సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని.. ఈ ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నా హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నాని అన్నారు. అలాగే గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కున్నారు.
Read Also:Konda Murali: 16 ఎకరాలు అమ్మి ఎన్నికలకు పోయినా.. 70 కోట్లు ఖర్చుపెట్టిన..!
ఇకపోతే, ప్రస్తుతం అందిన సమాచారం మేరకు మృతుల సంఖ్య 15కి చేరుకున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారులనుండి స్పష్టత రావాల్సి ఉంది.