H-CITI Project: 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు.. సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్..
- 7 ఫ్లైఓవర్లు, 7 అండర్ పాస్ లు
- సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనున్న కేబిఆర్ పార్క్ జంక్షన్
- రెండు ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టెందుకు నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు ఏడు అండర్ పాస్ ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అధికారులు. కేబిఆర్ పార్క్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. హెచ్ సిటీ లో భాగంగా కేబిఆర్ పార్క్ చుట్టూ 7 ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్ ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రెండు ప్రాజెక్టులుగా నిర్మాణం చేపట్టెందుకు నిర్ణయం.. ప్రాజెక్టు -1 లో భాగంగా బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ -2 నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మార్గంలో ఫ్లై ఓవర్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు.
Also Read:Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ నుంచి మోహన్ బాబు లుక్ వైరల్!
Also Read
- Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
- Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
- Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
ఈ నిర్మాణంతో సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా కేబిఆర్ పార్క్ జంక్షన్ మారనున్నది. సాగర్ సొసైటీ వద్ద నిర్మించే అండర్ పాస్ తో ఆ జంక్షన్ లో కూడ సింగ్నల్ ఫ్రీ కి అవకాశం ఉంది. ప్రాజెక్టు-2 లో క్యాన్సర్ హాస్పిటల్ నుండి అగ్రసేన్ మహారాజ్ జంక్షన్, రోడ్డు నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. రానున్న రెండేళ్ళలో అన్ని ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవాల్టి నుండి నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు పలు చోట్ల మళ్లింపులు చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పటికే వాహనదారులకు పలు సూచనలు చేశారు. సాగర్ సొసైటీ వద్ద ట్రాఫిక్ మళ్లింపు.. నిర్మాణ సమయంలో ప్రజలకు, వాహనదారులకు ఇబ్బంది లేకుండా ప్లాన్ చేశారు ట్రాఫిక్ పోలీసులు. ప్రారంభం పనుల వద్ద రూట్ పరిశీలించిన ట్రాఫిక్ పోలీసులు & రోడ్ ఇంజనీరింగ్ అధికారులు. కేబీఆర్ పార్క్ నుండి సాగర్ సొసైటీ రూట్ లో అవసరాన్ని బట్టీ రెండు వైపుల సింగిల్ రోడ్ లో వాహనాల రాకపోకలు సాగించేందుకు నిర్ణయించారు. రెండున్నర నెలల వ్యవధిలో పిల్లర్స్ పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రూ. 1000 కోట్లతో కేబీఆర్ పార్క్ చుట్టూ ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టనున్నారు. రెండున్నర ఏళ్ల వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారుల ప్లాన్. వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు.
Also Read:Saraswathi : వరలక్ష్మి ‘సరస్వతి’ కోసం లేడీ సూపర్ స్టార్ ఎంట్రీ..
ట్రాఫిక్ మల్లింపులు
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ (గేట్-1) ముగ్ధ జంక్షన్ మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు
బంజారాహిల్స్ రోడ్ నెం.1
జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వెళ్లేవారు రోడ్ నెం.10 క్యాన్సర్ హాస్పిటల్ అగ్రసేన్ ఐలాండ్ భారతీయ విద్యా భవన్ మీదుగా వెళ్లాలి.
మాసాబ్ ట్యాంక్ నుండి కేబీఆర్ పార్క్ జూబ్లీహిల్స్ వైపు వెళ్లేవారు విరించి హాస్పిటల్ రోడ్ 12 జంక్షన్ వద్ద ఎడమవైపు తిరిగి అగ్రసేన్ ఐలాండ్ ద్వారా వెళ్లాలి.
NFCL నుండి శ్రీనగర్ కాలనీ సాగర్ సొసైటీ ఇందిరానగర్ లేబర్ అడ్డా మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌కు వెళ్లాలి.
జూబ్లీహిల్స్ రోడ్ నెం 36/45 నుండి NFCL వైపు వెళ్లే వాహనాలు ఇందిరానగర్ శ్రీరామ్ నగర్ కాలనీ మీదుగా వెళ్లాలి.
తాజావార్తలు
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్‌లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!