Abhiram: మొత్తానికి ‘అహింస’ రిలీజ్ డేట్ లాక్ చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahimsa: వారసుల సినిమాల విడుదల కేక్ వాక్ అని చాలామంది భావిస్తుంటారు. కానీ సీత కష్టాలు సీతవి… పీత కష్టాలు పీతవి అని మనవాళ్ళు ఊరికే అనలేదు! లేకపోతే… మూవీ మొఘల్ డి. రామానాయుడు మనవడు, ప్రముఖ నిర్మాత డి. సురేశ్ బాబు తనయుడు అభిరామ్ మొదటి సినిమా విడుదలకు ఇంత జాప్యం జరుగుతుందని ఎవరైనా ఊహించారా!? ఈ సినిమా సురేశ్ బాబు నిర్మించకపోయినా… ఆయన మిత్రుడు, సినిమా రంగంలో ఎంతో పేరున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత పి. కిరణ్ నిర్మించారు. ప్రముఖ దర్శకుడు తేజ దీన్ని తెరకెక్కించారు. కానీ ఈ సినిమా విడుదల తేదీ పలు మార్లు వాయిదా పడి, ఎట్టకేలకు ఇప్పుడు కొత్త డేట్ తో జనం ముందుకు రాబోతోంది.
జూన్ 2న ‘అహింస’ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అభిరామ్ లుక్ ఆకట్టుకుంది. గీతికా తివారీ, రజత్ బేడీ, సదా, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్ టైగర్, కల్పలత, దేవి ప్రసాద్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించిన ఈ చిత్రానికి అనిల్ అచ్చుగట్ల సంభాషణలు రాయగా, సమీర్ రెడ్డి డీఓపీగా వ్యవహరించారు.
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
-
Trivikram : గురూజీకి హనుమాన్ అన్ష్ టెన్షన్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!