Chatrapathi: శ్రీనివాస్ హిందీలో పెద్ద స్టార్ అవుతాడు: వి. వి. వినాయక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. V. Vinayak: డైనమిక్ హీరో శ్రీనివాస్ బెల్లంకొండ, స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో పెన్ స్టూడియోస్ సంస్థ నిర్మించిన మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్ ‘ఛత్రపతి’. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి బ్లాక్‌బస్టర్ ‘ఛత్రపతి’కి ఇది రీమేక్. అదే టైటిల్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ ఈ నెల 12న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వినాయక్ మాట్లాడుతూ, “మంచి కథని అందించిన విజయేంద్ర ప్రసాద్ గారికి ముందుగా నా కృతజ్ఞతలు. రాజమౌళి గారు, ప్రభాస్ ‘ఛత్రపతి’ని అద్భుతంగా చేశారు. వారు చేసిన దాన్ని పాడు చేయకుండా ఐకానిక్ సీన్స్ షాట్స్ ఏమీ మార్చకుండా చాలా జాగ్రత్తగా చేశాం. ఏదైనా చిన్న మార్పు వున్నా ప్రసాద్ గారితో మాట్లాడి చాలా జాగ్రత్తగా తీశాం. సాయి సినిమాన్నీ నార్త్ లో బాగా ఆడాయి. ఆ నమ్మకంతో పెన్ స్టూడియో గడా గారు ఈ సినిమా నిర్మించారు. బెల్లంకొండ సురేష్ గారు మాకు బ్యాక్ బోన్. ఆయనకి సినిమా అంటే ప్యాషన్. సాయి అద్భుతంగా చేశాడు. ఇంటర్వెల్ సీన్ లో, యాక్షన్ సీన్స్ లో అతని నటన చూసి ఆశ్చర్యపోయాను. తనని పరిచయం చేసింది నేనే. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. అతనే ఇంత పరిణతితో ఇంత బాగా చేస్తున్నాడా! అనిపించింది. సాయి చాలా పెద్ద హీరోగా హిందీలో నిలబడతాడు. గడా గారు మరో రెండు సినిమాలు సాయితో చేయడం చాలా ఆనందంగావుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశతో వున్నాను. సక్సెస్ తర్వాత ఇంకా పెద్ద ఈవెంట్ నిర్వహిస్తాం’’ అని అన్నారు.
బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ, “అరవై కోట్లు తో పెన్ స్టూడియోస్ లాంటి నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేయడం తండ్రి నేను ఎంతో గర్వపడే విషయం. నార్త్ లో చాలా అద్భుతంగా ప్రమోట్ చేస్తున్నారు. హిందీలో నేను చేసినా ఇంత బాగా ప్రమోట్ చేయలేనేమో. ఎక్కడికి వెళ్ళిన అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తన సినిమాలని నార్త్ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకోవడం వలనే ఎక్కడి వెళ్ళిన ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. మాస్ పల్స్ తెల్సిన వినాయక్ గారు హిందీలో కూడా మా అబ్బాయిని లాంచ్ చేయడం చాలా ఆనందంగా వుంది. ఇది తెలుగు లో కూడా డబ్ చేయొచ్చు. కానీ హిందీలో తీసిన సినిమాని హిందీలో చూపిద్దామని వినాయక్ గారు అన్నారు. మన తెలుగు ఆడియన్స్ కూడా మన హీరో హిందీ లో ఎలా చేశాడో అని చూస్తారు. ఖచ్చితంగా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని చెప్పారు.
Also Read
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ పాదయాత్రపై కోమటిరెడ్డి సెటైర్లు..
-
NTA Exam Schedule: పరీక్షల క్యాలెండర్ విడుదల చేసిన NTA.. యూజీసీ నెట్ తేదీలివే..
-
Pakistan: పాక్ ఆర్మీకి అమెరికా డ్రోన్లు.. ట్రంప్ కుమారులతో లింక్.!
-
Trump-Houthi: సౌదీకి ట్రంప్ షాక్! హౌతీలతో రహస్య భేటీ.. అమెరికా సైడ్ అయినట్టేనా?
-
Warangal Cyber Crime : రూ.8 వేల కోసం ఖాతాలు అమ్మేశారు.. 185 సైబర్ కేసుల్లో లింకులు
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!