House Arrest : సీఎం జగిత్యాల టూర్.. ఎక్కడికక్కడ బీజేపీ, కాంగ్రెస్ నేతల అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక నేతలతో పాటు పరిసర పట్టణాలకు చెందిన విపక్ష నేతలను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ టూర్ ప్రశాంతంగా జరిగేందుకు.. కేసీఆర్ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే జగిత్యాలతో పాటు.. వేములవాడకు చెందిన పలవువురు కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. పోలీసులు హౌజ్ అరెస్ట్ చేయడంపై బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. సీఎం కేసీఆర్ నియంతల వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కేసీఆర్ ఆగడాలను ప్రజలకు గమనిస్తున్నారంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేతలు. అయితే.. 12 గంటలకు సిద్దిపేట జిల్లాలోని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం నుండి సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా జగిత్యాల చేరుకుంటారు.
Also Read : FIFA World Cup: పోర్చుగల్ గోల్స్ మోత.. ప్రపంచకప్ నుంచి స్విట్జర్లాండ్ నిష్క్రమణ
12 గంటల 30 నిమిషాలకు జగిత్యాల జిల్లాలో సమీకృత అధికారుల కార్యాలయం వద్ద ఉన్న హెలిప్యాడ్ కు వచ్చి… 12 గంటల 40 నిమిషాలకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. ఒంటి గంటకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాలకు శంకుస్థాపన.. 1.15 నిమిషాలకు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రారంభం చేస్తారు సీఎం కేసీఆర్. అనంతరం జిల్లా అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. తర్వాత అక్కడే లంచ్ ఏర్పాటు ఉంటుంది. 3 గంటల 10 నిమిషాలకు రోడ్ వే ద్వారా ప్రత్యేక బస్సులో జగిత్యాల జిల్లా కేంద్రాన్ని ఆనుకొని ఉన్న మోతె గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు అవుతారు సీఎం కేసీఆర్. 4 గంటల 15 నిమిషాలకు జగిత్యాల నుండి తిరిగి ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Also Read
- AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
- Kailash Mansarovar Yatra 1981: కైలాసానికి దారి మూసేసిన చైనా.. తెరిపించిన సుబ్రహ్మణ్యస్వామి.. 1981 నాటి ఆసక్తికర కథ..
- CM Chandrababu: ఉద్యోగుల సమస్యలపై ఫోకస్.. నేడు 11 సంఘాలతో సీఎం భేటీ.. పీఆర్సీ, ఐఆర్, డీఏపై కీలక చర్చ..
- BC Reservations: బీసీ రిజర్వేషన్లపై పిల్ కొట్టేయండి.. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్
తాజావార్తలు
-
Oppo A7 Pro: ఒప్పో A7 Pro లాంచ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్, IP69K రేటింగ్!
-
AP School Education Department: మెగా DSC-2025 నియామకంపై కీలక ప్రకటన.. విచారణకు ఆదేశించిన విద్యాశాఖ
-
KAAKA: మెగా అభిమానులకు మాస్ ట్రీట్.. సంక్రాంతి రేసులోనే చిరు! క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
-
Top 7 Indian Sequels: ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 7 సీక్వెల్స్ ఇవే!
-
Pickaxe Mountain: ‘త్వరలో పికాక్స్ పర్వతంపై దాడి చేస్తాం’ ఇరాన్ కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!