బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కాంగ్రెస్ నేతలు ఛార్జ్ షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీసీ అధ్యక్షుడు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. యాత్రకు వచ్చే ఆదరణ చూడలేకే బీఆర్‌ఎస్ దాడులకు పాల్పడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. యూత్ కాంగ్రెస్ నేతపై దాడి, భూపాలపల్లి సభపై దాడి వారి అరాచకానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. మాపై దాడులు చేస్తే బీఆర్‌ఎస్ నేతలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. స్థానికంగా ఇసుక దోపిడీ పెరిగిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ వస్తున్నారని తెలుసుకుని డంపింగ్ పనులు ఆపేశారని ఆయన విమర్శించారు. అనుమతులకు మించి ఇసుక తరలింపు జరుగుతుందని ఆయన మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, అక్రమంగా రోడ్లు వేసి మరీ ఇసుక తరలించుకు పోతున్నారని ధ్వజమెత్తారు.
Also Read : India vs Pakistan: భారత్‌కు శివరాత్రి పాక్‌కు కాళరాత్రి.. సచిన్ శివతాండవానికి 20 ఏళ్లు.
కేటీఆర్ పర్యటన ఉండగా బీజేపీ ఎమ్మెల్యే సభకు అనుమతులు ఎలా ఇచ్చారని, కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎందుకు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని ఆయన అన్నారు. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ.. దొరను ఓడించాలని రాజేందర్ ను గెలిపిస్తే.. ప్రజలకు ఒరిగిందేంటి? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ అక్రమాలపై ఇప్పటి వరకు ఇక్కడి ఎమ్మెల్యే పోరాడటం లేదని, ఈటల తన అక్రమాల్లో వాటా ఇచ్చినందుకే బీఆర్‌ఎస్ లో ఆయన్ను అందలం ఎక్కించారని ఆయన విమర్శించారు.
Also Read : Pattabhi Bail Petition:టీడీపీ నేత పట్టాభి బెయిల్ పిటిషన్ పై వాదనలు
ఈటల ఏనాడు రోడ్డెక్కి పోరాడింది లేదని, ఈటల పౌరసరఫరాల మంత్రిగా ఉండగా బియ్యం స్కాంలో డబ్బులు దండుకున్నారని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు, చీకటి వ్యాపారాలు బయటపడతాయనే ఈటల బీజేపీలో చేరారన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్కాంలే కానీ.. ప్రభుత్వ స్కీములు ప్రజలకు చేరడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ దొంగ కౌశిక్‌కు ఎమ్మెల్సీ ఇచ్చిందని, బీఆర్‌స్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు.