జగనన్న సురక్షా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ముగిసిన జగనన్న సురక్షా క్యాంపైన్ వివరాలను ప్రభుత్వ సలహాదారు సజ్జల ప్రజల ముందు పెట్టనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సజ్జల రామకృష్ణారెడ్డి జగనన్న సురక్షా క్యాంపెన్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తారు. అయితే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ జూన్ 23న ‘ జగనన్న సురక్ష ‘ అనే నెలరోజుల కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని గృహాలకు చేరువలో ఉన్న వారి సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ప్రారంభించారు.
Also Read : Minister KTR : తెలంగాణలో బీఆర్‌ఎస్ సంబరాలు
రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపుల నిర్వహించారు. అలాగే‘1902’తో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు. అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపనతో ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష ప్రారంభించారు. అలాగే ఈ ప్రత్యేక క్యాంపుల ద్వారా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్ కార్డు డివిజన్, హౌస్ హోల్డ్ డివిజన్, ఆదాయం) మొదలైన 11 రకాల ధ్రువీకరణపత్రాలు సర్వీస్ ఛార్జ్ లేకుండా ఉచితంగా అందించనున్నారు. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు.ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్ నంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు.
Also Read : Varalakshmi Sarathkumar: అయ్యో పాపం.. వాటిని పోగొట్టుకున్న హీరోయిన్.. వీడియోలో..