CM YS Jagan: అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఆయన రైతులకు పట్టాలు అందించనున్నారు.. ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. 2003కు ముందుకు సంబంధించిన అసైన్డ్‌భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీ చేయనున్నారు.. ఈ పర్యటన కోసం.. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న సీఎం.. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.. భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూముల పై సర్వ హక్కులు కల్పిస్తూ.. పట్టాలు అందజేస్తారు..
Read Also: Sabarimala: తెరుచుకున్న శబరిమల ఆలయం.. అయ్యప్ప దర్శనానికి భారీగా భక్తులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల 24 వేల 709 మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. 35 లక్షల 44 వేల 866 ఎకరాలపై అసైన్డ్ రైతులకు హక్కులు కల్పించనున్నారు.. కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేయనుంది ప్రభుత్వం.. 9,064 ఎకరాల లంక భూముల్లో 17, 768 మందికి అసైన్డ్ పట్టాలు ఇస్తారు.. తద్వారా అసైన్మెంట్ చేసి 20 ఏళ్లు పూర్తయిన 15 లక్షల 21 వేల 160 మంది రైతులు లబ్ధిపొందుతారు.. ఇక, 27 లక్షల 41 వేల 698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తారు.. 1563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని కేటాయించాలని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ నిర్ణయించింది.
Read Also: Nagulachavithi: నాగులచవితి విశిష్టత ఏమిటంటే..?
మొత్తంగా దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముగింపు పలకాలన్నారు. ఈ సంచలనాత్మక చొరవ భూ రెవెన్యూ వ్యవస్థలో ఒక నమూనా మార్పును సూచిస్తుంది, పేద గ్రామీణ ప్రజలకు న్యాయమైన భూ పంపిణీ మరియు రైతులకు పూర్తి యాజమాన్య హక్కులను ప్రసాదించే యుగానికి నాంది పలికినట్టు అవుతుంది.. భూమిలేని దళితులు, బలహీనవర్గాలు, పేదలకు అసైన్డ్ భూముల పంపిణీతోపాటు అసైన్డ్, గ్రామ సేవా ఇనామ్‌లు, ఎస్సీ కార్పొరేషన్ (ఎల్‌పీఎస్) భూములకు హక్కు పత్రాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. దళితుల గౌరవాన్ని నిలబెట్టడానికి కూడా సహాయపడతాయి.