Nuzvid: పలు నాటకీయ పరిణామాల మధ్య నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ఘన విజయం సాధించింది. మొత్తం 18 మంది మద్దతుతో టీడీపీ అభ్యర్థి విజయం సాధించింది. మరోవైపు వైసీపీ అభ్యర్థికి కేవలం 14 మంది మాత్రమే మద్దతు అందించారు. దింతో వైసీపీకి పరాభవం తప్పలేదు. ఈ ఎన్నికల్లో వైసీపీకి అనూహ్యంగా ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ పార్టీ సొంత కౌన్సిలర్లే టీడీపీకి మద్దతు ప్రకటించడం విశేషం. మొత్తం 10 మంది వైసీపీ కౌన్సిలర్లు…
తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగింది.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారంటూ పేర్కొన్నారు.
అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఈ రోజు ఆయన రైతులకు పట్టాలు అందించనున్నారు.. ఇవాళ ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్న సీఎం వైఎస్ జగన్.. 2003కు ముందుకు సంబంధించిన అసైన్డ్‌భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్డ్ భూములకు పట్టాల పంపిణీ చేయనున్నారు.
రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కేసీ రెడ్డి శుక్రవారం వెల్లడించారు.