CM YS Jagan Final Warning: ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్‌లో హీట్ పెరుగుతోంది.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. కార్యక్రమాల అమలులో వెనుకబడిన ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు.. పనితీరు మెరుగు పర్చుకొండి.. లేకపోతే నో టికెట్ అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు సీఎం జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.. ఎమ్మెల్యేల పని తీరుపై తన వద్దనున్న నివేదికలోని వివరాలను సమీక్షలో వెల్లడించారు.. అంతేకాకుండా జగనన్న సురక్ష కార్యక్రమంపై సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.. ఈ నెల 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించబోతున్నారు.
Read Also: Jagananna Suraksha: మరో కొత్త పథకానికి సీఎం జగన్ శ్రీకారం.. ఇక అన్నీ స్పాట్‌లోనే..!
అయితే, ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్‌గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.. అయితే, ఐప్యాక్ టీమ్ ఆ 18 మందితో ఇప్పటికే మాట్లాడారని తెలిపారు. మీరు చేసే కార్యక్రమాలు మీకు గ్రాఫ్‌ను పెంచుతాయని కీలక సూచనలు చేసిన జగన్.. ‘జగనన్న సురక్ష’ ద్వారా మీ గ్రాఫ్ మరింత పెంచుకోండన్న హితవు పలికిన సీఎం. అక్టోబర్‌లోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు దొరకదని స్పష్టం చేశారు.. అక్టోబర్ నాటికి తన వద్దనున్న నివేదికల ఆధారంగా టికెట్లు ఖరారు చేస్తామన్న జగన్. పని తీరు మెరుగుపర్చుకోని నేతలను ఊపేక్షించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. పని తీరు మెరుగుపర్చుకోకుంటే సీట్లు మార్చేస్తానని వెల్లడించారు. సీట్ల ఖరారు విషయంలో మొహమాటాలకు వెళ్లేదే లేదని కరాకండీగా తేల్చిచెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.