ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్‌గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.