ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలకు సీఎం వైఎస్ జగన్ ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు.. అక్టోబర్ నెల డెడ్ లైన్‌గా పెట్టారు.. అక్టోబరులోగా పని తీరు మెరుగు పర్చుకోకుంటే నో టికెట్స్ అంటూ తేల్చేశారు.. ఈ సమావేశంలో ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు సీఎం జగన్.. అక్టోబర్ నాటికి పని తీరు మెరుగుపరుచుకోవాలని సూచించిన ఆయన.. 18 మంది పేర్లు చెప్పడం సరికాదన్నారు.
Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ తాకింది.. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం మండలం కార్వేటినగరం పెద్ద దళితవాడలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు నారాయణస్వామి.. అయితే, కార్వేటి నగరం పెద్ద దళితవాడ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామిని ఓ మహిళ నిలదీసింది.. ఉచిత రేషన్ బియ్యం అన్నారు మాకు ఇంతవరకు వేయలేదన్న ఆ మహిళ.. ఇంటింటికి వచ్చి రేషన్ బియ్యం అందిస్తామన్నారు.. కానీ, మా ఇంటి దగ్గరికి ఏ…
YS Jagan: ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్‌కు నష్టం.. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. తాడేపల్లిలో జరిగిన గడపగడపకు కార్యక్రమం సమీక్షలో కీలక వ్యాఖ్యాలు చేశారు ఆయన.. గృహ సారథులను, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను పూర్తి చేసుకోవాలి.. ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి.. వాలంటీర్లను, గృహ సారథులను మమేకం చేయాలి.. వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని…
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ సర్కారు వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇంఛార్జ్ మంత్రులు, ముఖ్య నేతలతో పాటు, 175 నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.
అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పని తీరును పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో సీఎం జగన్‌కు పీకే టీమ్ వివరించింది. 10 రోజుల లోపు గడప గడపకు 22 మంది ఎమ్మెల్యేలు వెళ్లారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఇద్దరు ఎమ్మెల్యేలు…
ప్రజా ప్రతినిధులంతా ప్రజల వద్దకు వెళ్లేలా గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అయితే, కొన్ని ప్రాంతాల్లో ప్రజలనుంచి ప్రజా ప్రతినిధులకు నిరసన తప్పడంలేదు, తాజాగా, కర్నూలు జిల్లా కోడుమూరులో గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్‌ను నిలదీశారు ఓ వృద్ధురాలు.. సీఎం జగన్ వచ్చాక అన్నీ ఇస్తున్నాడు.. కానీ, అన్ని ధరలు పెంచాడని ఆ వృద్ధురాలు నిలదీసింది ఆమె. Read Also: Nageswara Rao: ఆంధ్రప్రదేశ్‌ని “వైయస్సార్ ప్రదేశ్”గా మార్చేయండి..!…