Jagananna Suraksha: సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్ వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.. ‘జగనన్న సురక్ష’ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయనున్నారు.. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి ప్రారంభిస్తారు.. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యంగా పెట్టుకున్నారు.. తరుచూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. స్పాట్‌లోనే సర్టిఫికేట్స్ ఇచ్చే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నెల రోజుల పాటు నిర్వహించబోతున్నారు.. సచివాయల స్థాయిలోనే సమస్యలను పరిష్కరించి, ప్రతి పౌరుడి ముఖంలో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు.. ఈ క్యాంపు ద్వారా ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది..
ప్రతి కుటుంబం యొక్క పథకాలు, పత్రాల సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.. వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న సురక్షా గురించి అవగాహన కలిపిస్తారు.. అంటే రాష్ట్రంలోని 1.6 కోట్ల కుటుంబాల వద్దకే అధికారులు వెళ్లనున్నారు.. ఈ సురక్షా క్యాంపులు 15 వేల సచివాలయాల్లో నిర్వహించనున్నారు.. ముందుగా గుర్తింపబడిన పత్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రతి సచివాలయంలో ఒక రోజు క్యాంపు నిర్వహిస్తారు.. 100 శాతం అర్హులను ప్రభుత్వ పథకాల్లో చేర్చడం మరియు పత్రాల సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం యొక్క టార్గెట్.
ఈ కార్యక్రమాన్ని మొత్తం 30 రోజుల పాటు నిర్హించనున్నారు.. 15 వేలకు పైగా సురక్షా క్యాంపుల ద్వారా 5.3 కోట్ల మంది పౌరులకు చేరువగా వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారు.. ఈ కార్యక్రమంలో 1.5 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగులు, మూడు వేలకు పైగా మండల అధికారులు, 26 మంది ప్రత్యేక అధికారులు పాల్గొంటారు.. ఇక, ఇంటింటిని సందర్శించనున్నారు 2.6 లక్షలకు పైగా వాలంటీర్లు, 7.5 లక్షలకు పైగా గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు.. 1.6 కోట్ల కుటుంబాలను కలవనున్నారు. మొత్తం 10 రౌండ్స్‌గా శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.. ప్రతీరోజు 1360 క్యాంపులు ఏర్పాటు చేస్తారు.. 75 లక్షల మంది ప్రజల సమస్యలు పరిష్కరించనున్నారు.
ఇక, కార్యక్రమం సమాచారం విషానికి వస్తే.. 1. మండల అధికారులచే వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు.. క్యాంప్ గురించి మరియు షెడ్యూల్ గురించి శిక్షణ పొందుతారు.. 2. క్యాంపుకి ముందుగానే వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటిని సందర్శించి, ప్రభుత్వ పథకాలు మరియు పత్రాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకొని.. పరిష్కారానికి కావాల్సిన పత్రాలను అప్పుడే సేకరిస్తారు. 3. మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు ఉండి అక్కడికక్కడే పథకాల సమస్యలు పరిష్కరించడం మరియు పత్రాలు జారీ చేస్తారు. 4. ఇంటింటి సందర్శన మరియు క్యాంప్ నిర్వహణపై ప్రభుత్వంలోని FoA & JCS నెట్‌వర్క్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. అయితే, మొత్తంగా 10 రౌండ్లగా ఈ కార్యక్రమం ఉంటుంది.. తొలి రౌండ్ వాలంటీర్ ట్రైనింగ్ జూన్ 23న ప్రారంభం కాగా.. ఇంటింటి సందర్శన జూన్ 24న ఉంటుంది.. ఇక, సురక్షా క్యాంప్ జులై 1న నిర్వహిస్తారు.. ఇలా చివరి పదో రౌండ్‌కు వచ్చే సరికి జులై 17న వాలంటీర్ ట్రైనింగ్. జులై 18న ఇంటింటి సందర్శన, జులై 25న సురక్షా క్యాంప్ నిర్వహణ ఉంటుంది.
జగనన్న సురక్ష క్యాంపుల ద్వారా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు), ఆదాయ ధ్రువీకరణ పత్రం, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, మరణ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ , మ్యుటేషన్ ఫర్ కరక్షన్స్ , వివాహ ధ్రువీకరణ పత్రం , ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు , ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్ అప్‌డేట్ , కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ) , కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన , ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.. లాంటి సేవలను అందించనున్నారు.