CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాంజీ గోండు, కొమురంభీం పోరాటాలను సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా వాసులకు వరాల జల్లు కురిపించారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని.. కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చామని.. పనులు చేస్తున్నామని తెలిపారు. తుమ్మడిహట్టిలో ప్రాజెక్టు నిర్మిస్తామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. అక్కడి ముంపు ప్రాంతాలపై ఆ ప్రభుత్వంను ఒప్పిస్తామని సీఎం రేవంత్ అన్నారు ఆదిలాబాద్‌లో యూనివర్శిటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ, కేడీ కలసి సిమెంట్ కర్మాగారం అలానే ఉంచారని.. ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి అయినా సరే ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు.
Read Also: Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది.. రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు..
Also Read
- KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
- Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
కూ.1325 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నామన్నారు. పాదయాత్రలో మహిళలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని భట్టి విక్రమార్క దృష్టి తీసుకొచ్చారని.. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని. కానీ కేసీఆర్, ఆయన కుమారుడు కట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, మోడీ పదేళ్లుగా పాలన చేసిన వారిద్దరు ప్రజలకు ఏం చేయలేదన్నారు. వంద రోజుల్లో ఏం చేయలేదు అని చెప్పే బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నడిరోడ్డు మీద ఉరితీయాలా.. ఆలోచించాలన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదని.. గిరిజన యూనవర్సిటీని ఆపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారంటూ విమర్శలు గుప్పించారన్నారు. పదేళ్లు బీజేపీకి ఇచ్చారని.. కాంగ్రెస్‌కు పదేళ్లు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
-
KAAKA: రూమర్స్‌కి చెక్మెట్.. సంక్రాంతి బరిలో చిరంజీవి ‘కాక’ ఫిక్స్.!
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్‌నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్‌పోన్..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!