రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం �
చేవెళ్ళ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర చేయూతనిచ్చినట్టు కనిపిస్తోంది. శనివారం రాష్ట్ర కాంగ్రెస్ నిర్వహించిన తుక్కుగూడ బహిరంగ సభ కిక్కిరిసిపోయింది. కాంగ్రెస్ శ్రేణులంతా కదం తొక్కారు. పార్టీ కార్యకర్తలు లక్షలాదిగా తరలిరాగా... చేవెళ్ళ ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి కార్యక�
జాతీయ మేనిఫెస్టోను తెలంగాణ గడ్డ మీద విడుదల చేయడం సంతోషమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తుక్కుగూడ జనజాతర సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌ను ఓడించిన ఉత్సాహంతోనే బీజేపీని ఓడించాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని రేవంత్ తెలిపారు.
చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఆరు గ్యారంటీలకు అప్లయ్ చేసిన ప్రతి అర్హుడికి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు తీసుకువచ్చేందుకు తాను పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు. తన ప్రాంతంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందేదాకా తాను నిద్రపోనని ఆయన వ్యాఖ్యానించారు.
తొమ్మిదేండ్ల అహంకార పాలనకు చరమ గీతం పాడింది కాంగ్రెస్ కార్యకర్తలేనని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. తుక్కుగూడ 'జనజాతర' సభలో ఆమె ప్రసంగించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్న ఆమె.. ఆరు హామీలపై కీలక ప్రకటన చేశారు.