CM Revanth Reddy : చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని ఆయన వ్యాఖ్యానించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా ఉండేవని, దళితులు, గిరిజనులు, బీసీ మైనార్టీలందరికీ ఒకేచోట ఇందిరమ్మ ఇండ్లు కేటాయించేలా అధికారులను ఆదేశించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతీ నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు చేసి కులాల మధ్య అంతరాలు చేరిపేయాలనుకుంటున్నామని, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్ లో శంకుస్థాపన చేసామన్నారు.
Rakhi Sawant: అనంత్ అంబానీ బరువుపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్‌పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
అంతేకాకుండా..’చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువుకుంటేనే గుర్తింపు, గౌరవం వచ్చాయి. లోక్ సభ స్పీకర్ గా తెలంగాణ బిల్లును ఆమోదించింది జగ్జీవన్ రామ్ కూతురు మీరాకుమారి. తెలంగాణ రాష్ట్రమంతా మీరా కుమారిని ఎప్పుడూ గుర్తుచేసుకుంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. ఒకసారి దొరల చేతిలో ఉంటే.. ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుంది. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇవాళ అసెంబ్లీలో గడ్డం ప్రసాద్ గారిని అధ్యక్షా అని పిలవాల్సిందే.. కొందరు కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు… అసలు ఆ ప్రశ్నించే హక్కును, అధికారాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీనే.. చదువును ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు… చదువే లక్ష్యంగా పెట్టుకుని ఉన్నత శిఖరాలకు ఎదగండి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?