డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఎన్నో సంస్కరణలకు కృషి చేశారన్నారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం ఆయన గాంధీ కుటుంబంతో, కాంగ్రెస్ పార్టీతో కొనసాగారని ఆయన వ్యాఖ్యానించారు. జగ్జీవన్ రామ్ స్పూర్తితో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గతంలో రెసిడెన్షియల్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లకు విడి విడిగా…