NTV Telugu Site icon

CM Revanth Reddy : మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోంది

Cm Revanth

Cm Revanth

CM Revanth Reddy : సీఎం రేవంత్‌ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్‌ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్‌ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. స్థానిక మత్స్యకారులు, నేతన్నలతో సీఎం రేవంత్‌ రెడ్డి ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. చాలా మంది దుర్మార్గులు ఉంటారు.. అందులో బీఆర్‌ఎస్‌ ముందు ఉంటదని, బీఆర్‌ఎస్‌ వాళ్ళను పిలిచి నల్గొండ బాగుపడాలా వద్దా అని అడగండని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ మన కాళ్లల్లో కట్టే పెడుతున్నారని, మూసీ అణుబాంబు కంటే ప్రమాదంగా మారబోతోందని సీఎం రేవంత్‌ అన్నారు. మన జీవితంతో చెలగాటం ఆడుతుంటే… చైతన్యంగా ఉండాలా లేదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఒకడు అంటున్నాడు.. లక్ష 50 వేల కోట్లు మూసీకి పెడుతున్నారని, దాంట్లో 25 వేల కోట్లు రేవంత్ దోసిండు అంటున్నాడు.. ఓరి సన్నాసి.. నేను దోచుకోవాలి అంటే నల్గొండ ప్రజలు సొమ్ము అవసరమా.. నువ్వు తెచ్చిన ధరణిలో కోకాపేట పై ఫోకస్ పెడితే డబ్బులు వస్తాయని ఆయన అన్నారు.

Netherland: ఇజ్రాయెల్ ఫుట్‌బాల్ అభిమానుల‌పై పాలస్తీనా అనుకూల గుంపు దాడి.. తీవ్రంగా స్పందించిన నెతన్యాహు

నకిలీ బీజేపీ నేతకునా సూటి ప్రశ్న.. మోడీ గుజరాత్‌లో సబర్మతి నది నీ బాగుచేసుకున్నారు.. మరి నా తెలంగాణ లో మూసి నీ బాగు చేసుకోవద్దా.. అని సీఎం రేవంత్ అన్నారు. బుల్డోజర్‌లకు అడ్డం పంటారో చెప్పండి.. మా నల్గొండ వాళ్ళని పిలిచి మీ మీదినుండి బుల్డోజర్ తొలిస్తా రండి.. ధైర్యం ఉంటే.. తేది చెప్పండి.. మా వెంకన్న నీ బుల్డోజర్ ఎక్కిస్త.. మా సామ్యూల్ తో జెండా ఊపి తొక్కిస్త రండి.. అని సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్గొండలో మీరు ఇంత ధైర్యం ఇచ్చాకా.. సంగెం శివయ్య ఆశీస్సులు ఇచ్చాకా బుల్డోజర్ లతో తొక్కించి ముందుకు పోతా.. ఎవడో ఇస్తే కుర్చీలో కూర్చో లే.. ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపించారు.. మీరు అండగా ఉన్నారు.. మీరే అధికారం ఇచ్చారు అని ఆయన అన్నారు.

అంతేకాకుండా..’మీరు అధికారం ఇచ్చినప్పుడు మీ కష్టం లో మేము అండగా ఉండాలి కదా.. నీ బిడ్డ మూడు నెలలు జైల్లో ఉంటే పుట్టెడు దుఃఖం వచ్చింది కేసీఆర్.. మా ఆడబిడ్డలు.. పిల్లలు జీవితాంతం వికలాంగులు అయితున్నారు.. వాళ్ళ బాధ కనపడదా కేసీఆర్..నీకు పాపం తగులుతుంది.. బిల్లా రంగాల వైపు ఉంటారా ..? మూసీ ప్రక్షాళన వైపు ఉంటారా చెప్పండి.. నల్గొండ బీజేపీ.. బీఆర్‌ఎస్‌ వాళ్ళు వద్దు అంటే చెప్పండి.. చరిత్ర హీనులు గా మారిపోతారు.. మూపీ ప్రక్షాళన చేసి తీరుతాం.. భీమలింగమ్ శివయ్య కి 2 కోట్లు.. 30 రోజుల్లో ప్రాజెక్టు డిసైన్ పూర్తి ఆవుతుంది. వాడపల్లి నుండి పాదయాత్ర మొదలు పెడతా.. చార్మినార్ వరకు నడుస్త.. హరీష్.. కేటీఆర్ నడుద్దాం రండి.. జనవరి మొదటి వారంలో పాదయాత్ర చేద్దాం… రండి.. ఇవాళ్టి యాత్ర ట్రైలర్.. అసలు సినిమా జనవరిలో..’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Atchannaidu: మహిళలపై అసహ్యకరమైన పోస్టులు పెడితే.. అదే మీకు చివరి రోజు

Show comments