Kavitha Yatra: నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట పేరుతో సుదీర్ఘ యాత్ర చేపట్టబోతున్నారు. ఈరోజు నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు నాలుగు నెలల పాటు జిల్లాల పర్యటన కొనసాగనుంది.
సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప పాదయాత్ర చేపట్టారు. సంగెం-భీమలింగం-ధర్మారెడ్డిపల్లి కెనాల్ నుంచి నాగిరెడ్డిపల్లి వరకు సాగిన పాదయాత్ర కొనసాగింది. మూసీలో నీటి కాలుష్యాన్ని పరిశీలించిన రేవంత్ రెడ్డి.. భీమలింగంకు పూజలు చేశారు. రైతులను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు.