డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ ప్రసంగించారు.
READ MORE: Kubera : కుబేరను మిస్ చేసుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. నిజమేనా..?
పంజాబ్ రాష్ట్రం డ్రగ్స్ లో మునిగి పోయిందని.. యుద్ధం లో యోధులు పంజాబ్ యువకులని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు డ్రగ్స్ బారిన పడ్డారన్నారు. రాష్ట్ర సరిహద్దులో డ్రగ్స్.. గంజాయితో ఎవరైనా రావాలి అంటే భయం పుట్టాలని హెచ్చరించారు. అవసరం అనుకుంటే రాష్ట్రం దాటి వాళ్లను పంపించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.. ఈగల్ లోగోను సీఎం ఆవిష్కరించారు. ఇకపై నార్కొటిక్ బ్యూరోను.. ఈగల్‌గా పిలుస్తామని స్పష్టం చేశారు.. ఎక్కడ గంజాయి కనిపించినా ఈ ఈగల్ పట్టుకుంటుందని సీఎం వెల్లడించారు.
READ MORE: Ayesha Meera Case: హైకోర్టులో ఆయేషా మీరా తల్లిదండ్రుల పిటిషన్.. తుది నివేదిక పరిశీలించండి..
కాలేజీ యాజమాన్యాలకు చెప్తున్న.. మీ దగ్గర ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా మీరే బాధ్యులని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. తల్లిదండ్రులు మీపై నమ్మకం తో పిల్లలను అప్పగిస్తారని.. ఏ కాలేజీ లో డ్రగ్స్..గంజాయి దొరికినా… వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని సూచించారు. ఫీజులు తీసుకోవడమే కాదు.. వాళ్ళు ఏం చేస్తున్నారో చూసుకునే బాధ్యత కూడా మీదే అని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ లు కూడా దీని మీద ఫోకస్ చేయాలన్నారు. స్కూల్స్.. కాలేజీలు యాజమాన్యం లను పిలిచి చెప్పాలని సూచించారు. కాలేజీలు.. స్కూల్స్ ముందు ఉండే దుకాణాల్లో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్నారని.. ఏదైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
