రామ్‌చరణ్ స్కూల్ కి వెళ్ళేటప్పుడు నుంచి తెలుసని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఇవాళ హీరో అయ్యాడు. RRR తో దేశానికి గౌరవం తెచ్చి పెట్టాడని కొనియాడారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చిందని గుర్తు చేశారు. తాజాగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ యాంటీ డ్రగ్, ఇల్లీగల్ ట్రాఫికింగ్ డే అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్, హీరోలు రామ్‌చరణ్, విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ చరణ్, విజయ్…
డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.