విశ్వనటుడు కమల్ హాసన్ ,కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నలేటెస్ట్ మూవీ “భారతీయుడు 2 “. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా మరియు ఎస్‌జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఉదయనిధ స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి గ్రాండ్ గా నిర్మిస్తుంది.తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా జూన్ లో థియేటర్స్ కు రానున్నట్లు ప్రకటించారు.
అయితే విడుదల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు .అయితే ఇప్పుడు ఈ సినిమా జూన్ లో విడుదల కావడం కష్టమని తెలుస్తుంది .పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898 ఏడి “..సినిమా జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది .ముందుగా ఈ మూవీ మే 9 న విడుదల కావాల్సి వుంది .కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడింది.దీనితో జూన్ 27 న ఈ సినిమా విడుదల కానుంది.అయితే భారతీయుడు 2 సినిమాను జూన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్దమైన కూడా ప్రభాస్ మూవీ ఉండటంతో ఏ తేదీన రిలీజ్ చేసేది క్లారిటీ ఇవ్వలేదు .దీనితో ఈ మూవీ విడుదల జులై కి వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈ మూవీ రిలీజ్ పై మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి వుంది .