CM Revanth Reddy : అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్
- అసెంబ్లీకి రా.. చర్చ పెడదాం
- రైతు బంధు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చారు
- ధనిక రాష్ట్రమంటూ అబద్ధాలు చెబుతూ.. అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారు : సీఎం రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణను ధనిక రాష్ట్రంగా మార్చినట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్ణయాలను విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్ద ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణను అప్పుల గడ్డకెక్కించినట్లు ధ్వజమెత్తారు. 2023లో మా వద్దకి రూ.7 లక్షల కోట్లు అప్పు చేయడంతో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రూ.18వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేసింది. ఈ రుణమాఫీ వడ్డీలకే సరిపోయింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని అన్నారు.
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి లెక్కలు చెబుతారని నమ్ముతుంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో ఉండి సోది మాట్లాడటం కాదు, నిజం చెప్పాలి. అసెంబ్లీకి రమ్మని, రైతులకు ఎన్ని రుణమాఫీలు చేశామో అసెంబ్లీ ముందు వివరంగా చెప్పాలని అన్నారు. కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. దళితుల కోసం 3 ఎకరాల భూమి, దళిత సీఎం, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వంటి హామీలను ఇచ్చి మాట తప్పిన చరిత్ర కేసీఆర్ కు ఉంటే, అది ప్రజల్ని మోసం చేయడమే అని రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్, ప్రజల నుంచి తప్పించి పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. పాలమూరు ప్రాజెక్టుల గురించి హామీ ఇచ్చి, స్వంత ప్రాజెక్టులలో రుణాలు చెయ్యడమే అన్యాయంగా ఉందన్నారు.
Also Read
PM Modi: పేదోడికి ఇల్లు ఉండాలన్నదే తన కల.. ఢిల్లీ ఎన్నికల్లో మోడీ వ్యాఖ్య
అంతేకాకుండా..’అసెంబ్లీ ఎన్నికలను అడ్డు పెట్టుకుని రైతు బంధు ఎగ్గొట్టిన చరిత్ర కేసీఆర్‌ది. ఆయన ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులను మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల ఖాతాలో వేశాం. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ చేసిన రైతు రుణమాఫీ కేవలం రూ.18వేల కోట్లు మాత్రమే. ఇందులో మిత్తికి పోగా నికరంగా ఆయన చేసిన రుణమాఫీ కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే. కానీ మేం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 21వేల కోట్లు రుణమాఫీ చేశాం. మేం రుణమాఫీ చేయలేదంటున్న కేసీఆర్ ఫాం హౌస్ కు వచ్చినోళ్లకు చోద్యం చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా లెక్కలు చెబుతాం.. రైతుల జాబితాతో సహా మేం చేసిన రుణమాఫీ లెక్కలు చూపిస్తాం.. నీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రా.. నీలా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి పంగనామాలు పెట్టిన చరిత్ర నాది కాదు..
ఆయన గంభీరంగా చూస్తున్నడట.. ఎవరిని చూస్తున్నావ్? అచ్చోసిన ఆబోతుల్లా కొడుకు, అల్లుడిని ఊరిమీదకు వదిలిండు. జహంగీర్ పీర్ దర్గాకు, వేములవాడ రాజన్నకు నిధులు ఇస్తానని మోసం చేసినవ్.. పాలమూరును ఎరవేసి ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.. మాప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ జరిగింది, రైతు భరోసానూ ఇస్తున్నం.. మార్చి 31 లోగా రూ.10 వేల కోట్లు రైతు భరోసా వేస్తాం.. భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తాం.. మొదటి ఏడాదిలోనే 55142 ఉద్యోగ నియామకాలు పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వానిది.. నీ నాయకత్వంపై నీకు నమ్మకం ఉంటే అసెంబ్లీకి రా.. కొడితే బలంగా కొట్టడం సంగతి పక్కకు పెడితే సరిగ్గా నిలబడటం నేర్చుకో.. ట్విట్టర్ లో ఈయనకు లైకులు ఎక్కువ వచ్చాయని చెప్పుకుంటుండు..
పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన సోషల్ మీడియాలో లైకులు వచ్చాయని చెప్పుకుంటుండు అంటే ఆయన మానసిక స్థితి ఎట్లుందో అర్థం చేసుకోండి.. కేసీఆర్ ముందు నీ కొడుకును, అల్లుడిని దారిలో పెట్టుకో.. బీసీ కులగణన, మాదిగ వర్గీకరణపై ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీ పెడుతున్నాం.. పొంకనాలు కొట్టుడు కాదు.. దమ్ముంటే అసెంబ్లీకి రా మాట్లాడుకుందాం.. ఫాం హౌస్ లో ఉన్న కేసీఆర్ కు ప్రజలతో బంధం తెగిపోయింది.. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి నోటు.. కేసీఆర్ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే ఫామ్ హౌస్ లోనే పడుకో’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
CM Revanth Reddy : విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటింది
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు